తారక్ కొత్త లుక్‌తో అదరగొట్టబోతున్నాడని అందరూ ఆనందిస్తున్నారు. రాజమౌళి 'ట్రిపుల్ ఆర్'లో తారక్‌ని పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశాడని మురిసిపోతున్నారు. అయితే కొమరం భీమ్ లుక్ మాత్రమే కాదు, జూనియర్ని పూర్తిగా మార్చేసిన ఘనత కూడా జక్కన్నకే దక్కుతుంది.
జూ.ఎన్టీఆర్‌కి ఫస్ట్ హిట్ ఇచ్చిన సినిమా.. రాజమౌళి మొదటిసారి మెగాఫోన్ పట్టిన సినిమా 'స్టూడెంట్ నం.1'. ఈ మూవీ నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం మొదలయింది. ఈ ఫ్రెండ్షిప్తోనే తారక్ లుక్‌పై కామెంట్ చేశాడట రాజమౌళి. 'రాఖీ' సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు. అప్పుడు తారక్‌ని చాలా అసహ్యంగా ఉన్నావని చెప్పాడట జక్కన్న.
'యమదొంగ' సమయానికి రాజమౌళి కూడా ఆశ్చర్యపోయేలా జూనియర్ ఎన్టీఆర్ స్లిమ్ అయ్యాడు. ఆ తర్వాత 'టెంపర్' సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇక ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్'లో మేచూమేన్లా కనిపిస్తున్నాడు. అందుకే ఒక్క మాటతో బరువు మొత్తాన్ని కరిగించిన రాజమౌళిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు తారక్. జక్కన్న చేతిలో శిల్పంలా మారాడు ఈ తారకరాముడు. విమర్శించిన నోటి నుండే పొగడ్తలు వస్తున్నాయి.
మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కండలు పెంచేశాడు. ఆర్ఆర్ఆర్ లో తారక్ నుంచి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాదు అలానే తయారు కావాలని రోల్ మోడల్ గా ఉంచుకొని.. వాళ్లూ కండలు పెంచుకునే పనిలో ఉన్నారు. తమ అభిమాన హీరోను ఎప్పుడు తెరపై చూడాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.