సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయింది అంటే , అదే సినిమా టైటిల్ తో రెండు మూడు సినిమాలు రావడం జరుగుతుంది . కానీ వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధిస్తాయి అని చెప్పలేము ..కానీ ఇక్కడ కూడా ఏకంగా నలుగురు స్టార్ హీరోలు సర్దార్ అనే సినిమా టైటిల్ తో సినిమాలను తెరకెక్కించారు. అయితే ఆ సినిమాల ఫలితాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

1. సర్దార్ పాపారాయుడు:
1980వ సంవత్సరంలో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్ పై దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా సర్దార్ పాపారాయుడు.ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా, నందమూరి తారకరామారావు హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు.2. సర్దార్ కృష్ణమనాయుడు:
ఎన్టీఆర్ సినిమా కు పోటీ గా ఉండాలని తిరిగి దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత 1987 సంవత్సరంలో బాల బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మాతగా ,ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కృష్ణ ,విజయశాంతి, ఊర్వశి ,శారద లు కూడా నటించారు. అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ ను చవి చూసింది.
3. సర్దార్ ధర్మన్న:
1987వ సంవత్సరంలో భాస్కర్ రావ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి యలమంచిలి సాయిబాబా నిర్మాతలు గా ఉన్నారు . ఇందులో కృష్ణంరాజు, రాధిక, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించారు.. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించ గా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది.4. సర్దార్ గబ్బర్ సింగ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2016 సంవత్సరంలో శరత్ మరార్ నిర్మాణం.. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో కాజల్, పవన్ కళ్యాణ్ కలసి నటించారు . గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను అందుకుంది..
మొత్తానికి సర్దార్ అనే సినిమా టైటిల్ తో నాలుగు సినిమాలు వచ్చినప్పటికీ,  కేవలం ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: