ఇంకా ఇందులో ఎప్పుడూ కోపంగా వుండే అమ్మాయిలాగా ఆర్తి అగర్వాల్ బాగా నటించింది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, సుధా ,సుహాసిని, హేమ, ఎం.ఎస్.నారాయణ ,తనికెళ్ల భరణి, చంద్రమోహన్ తదితరులు నటించడం గమనార్హం. కే విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించాడు.. ఇందులో ప్రతి మాట కూడా ప్రేక్షకులను బాగా నవ్వించేశాయి.. ఇకపోతే ఈ సినిమా విడుదలై నేటికి 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.అంతేకాదు ఈ సినిమాతోనే ఆర్తి అగర్వాల్ మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి అని చెప్పవచ్చు.
ఈ సినిమా పాటలు అప్పట్లో రేడియోలో కూడా వినిపించేవి.. టీవీలు లేని సమయంలో చాలామంది రాత్రి సమయం ఎప్పుడు అవుతుంది.. రేడియో లో ఈ పాటలు ఎప్పుడు విందాం అని కూడా ఎదురు చూస్తూ ఉండే వారు.. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే థియేటర్ల వద్ద ఈ సినిమా ఎన్ని కలెక్షన్లను రాబట్టింది అంటే..7.24 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.18.04 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా బయ్యర్లకు రూ.10.8 కోట్ల లాభాలు వచ్చాయి అని చెప్పాలి.