అయితే ఇందులో తెలుగులో భద్రాచలం మరియు వైశాలి, చందమామ తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగా ఆకట్టుకున్న టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అయిన "సింధూ మీనన్" కూడా ఈ కోవకే చెందుతుందని తెలుస్తుంది.కాగా నటి సింధు మీనన్ తెలుగులో "భద్రాచలం" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైందట. కానీ మొదటగా కన్నడ భాషలో "రష్మీ" అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిందని సమాచారం. ఆ తర్వాత తమిళం, మలయాళం, తెలుగు తదితర భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ కొన్ని సంవత్సరాలపాటు సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడిపిందని తెలుస్తుంది.
కానీ అనుకోకుండా ఒకానొక సమయంలో సింధు మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించిందని సమాచారం.ఈ క్రమంలో బ్రిటన్ లో సాఫ్టు వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న "డొమినిక్ ప్రభు" అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందట.అయితే పెళ్లయిన తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి కూడా పెద్దగా తన ఫేట్ మార్చలేకపోయాయట.
దీంతో సింధుమీనన్ నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన భర్తతో బ్రిటన్ దేశంలో సెటిల్ అయినట్లు తెలుస్తుంది. అయితే సినీ పరిశ్రమ నుంచి వైదొలగిన సింధు మీనన్ సోషల్ మీడియా మాధ్యమాలలో అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోందట. కాగా తాజాగా సింధు మీనన్ తన భర్త మరియు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను నెటిజన్లతో పంచుకుందని తెలుస్తుంది. దీంతో ఈ ఫోటోలో సిందు మీనన్ ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారట. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నటి సింధు మీనన్ బాగానే బరువు పెరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారని సమాచారం.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సినీ కెరియర్ కి స్వస్తి పలికి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన నటీనటులు కూడా సినిమా పరిశ్రమలో చాలామంది ఉన్నారట. కానీ నటి సింధు మీనన్ మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయించిందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నటి సింధు మీనన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు అవకాశాలు తలుపు తట్టినప్పటికీ నటనపై ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది.