బాలకృష్ణ మొదట సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ,తన తండ్రితో సహా పలు చిత్రాలు కూడా నిర్మించి, ఒక మంచి నటుడిగా అప్పట్లోనే గుర్తింపు పొందాడు.ఇకపోతే ఆయన తన సినీ కెరీర్ కు ఎప్పుడు బ్రేక్ ఇవ్వకుండా నిర్విరామంగా హీరో గా పని చేస్తూనే వస్తున్నాడు. 1974 వ సంవత్సరం లో తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మకల అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన బాలకృష్ణ , వెండితెరకు ఒక ఆణిముత్యం లా గుర్తింపు పొందాడు..

ఇకపోతే బాలకృష్ణ  కు ఒక దర్శకుడు అసలు కలిసి రావట్లేదట.. ఆయన ఎవరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 1985 సంవత్సరంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పట్టాభిషేకం. ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ, హీరోయిన్ విజయశాంతి నటించారు.. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథ అందించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అయితే మరోసారి చిన్న ప్రయత్నం గా 1986 వ సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు సోదరుడైన కే కృష్ణ మోహన్ రావు నిర్మాణంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రం అపూర్వ సహోదరులు. భానుప్రియ, విజయశాంతి లు హీరోయిన్లు గా నటించగా, బాలకృష్ణ హీరోగా నటించారు. అంతేకాదు బాలకృష్ణ మొదటి సారి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం గమనార్హం. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది..

మూడోసారి ముచ్చటగా అయిన విజయం  అందుకుందామని తిరిగి ఇదే కాంబినేషన్ లో 1987లో కేసీ శేఖర్ బాబు  నిర్మాణం వహించిన చిత్రం సాహస సామ్రాట్. ఇందులో కూడా విజయశాంతి - బాలకృష్ణ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది. అంతేకాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు - బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తిరిగి  1988వ సంవత్సరంలో గోపి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన .. దొంగరాముడు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. అందుకే  వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు అంటే నిర్మాతలు భయపడతారు.


వీటితోపాటు అశ్వమేధం, పాండురంగడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ,ఇక వీరిద్దరూ తిరిగి మరో సినిమా చేయాలని అనుకోలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: