నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదనీ మరియు రెగ్యులర్ ఓల్డ్ స్టోరీ అని అలాగే స్లో నెరేషన్‌తో బోర్ కొట్టించిందనీ అత్యధిక ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారని సమాచారం. నానికి వరుసగా ఓటీటీ వేదికపై ఇది రెండో ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయని సమాచారం. ఇదివరకు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో నాని నెగటివ్ రోల్ చేసిన 'వి' మూవీ కూడా నేరుగా ఓటీటీలో విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు 'టక్ జగదీష్' కూడా అదే బాట పడుతోందని ప్రాథమిక అంచనా తెలియజేస్తోందని సమాచారం.

కాగా ఈ సినిమాలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములను కలపడానికి వాళ్లింటికి నాని వెళ్లే సీనుందని సమాచారం. అందులో నానిని వాళ్లు బెదిరిస్తుంటే, భోజనానికి కూర్చున్న నాని షర్టు వెనక నుంచి పొడవాటి కత్తిని బయటకు తీస్తాడట. దానితో ఉల్లిపాయను ముక్కలుగా తరుగుతూ డైలాగులు చెప్తాడని సమాచారం. తరగడం పూర్తయ్యాక ఆ కత్తిని విసురుతాడని తెలుస్తుంది.

అది వెళ్లి చెక్క స్తంభానికి గుచ్చుకుంటుందట. అప్పుడు ఆ అన్నదమ్ములకు కనువిప్పు కలుగుతుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సీనుకు సంబంధించి ఓ అభిమాని రాసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని సమాచారం.

నాని షర్టులోంచి కత్తి తీస్తున్న ఫొటోను ఫస్ట్ లుక్ కింద 2020 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారట. దాన్ని షేర్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ, "ట్రెమండస్ రెస్పాన్స్ ఫర్ టక్ జగదీష్ ఫస్ట్ లుక్ అంటూ థాంక్యూ వన్ అండ్ ఆల్" అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపాడని సమాచారం. అయితే అశ్విన్ అనే ఓ అభిమాని అదే రోజు శివ నిర్వాణ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ, "అని నువ్వు అనుకుంటే సరిపోదుగా అన్నా

'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయ్‌) లుక్‌ లాగే ఉందని తెలిపాదట.కొత్తగా ఏమి లేదు అలాగే ఆ కత్తి ఎలాగో ఏదో కామెడీ సీన్‌కు అయ్యుంటదిలే నిమ్మకాయో లేదా

ఉల్లిపాయో కొయ్యడానికి.." అని కామెంట్ పెట్టాడని సమాచారం.సరిగ్గా అతను ఊహించినట్లే సినిమాలో నాన్ వెజ్ భోజనానికి కూర్చున్న నాని ఉల్లిపాయ కోయడానికే ఆ కత్తిని బయటకు తీశాడని తెలుస్తుంది.

ఆ అభిమాని ఊహాగానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారట నెటిజన్లు. మొత్తానికి 'టక్ జగదీష్' పరిస్థితి కామెడీ లాగే తయారయ్యిందని తెలుస్తుంది. నిర్మాతలు సినిమాని ఓటీటీలో విడుదల చేసి మంచిపనే చేశారనీ, థియేటర్లలో రిలీజ్ చేసుంటే బయ్యర్లు ఆరిపోయేవారని పలువురు కామెంట్ చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: