టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది.అయితే ఆ సినిమా సరైన ఫలితాన్ని రాబట్టకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది కియారా. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ కి జోడిగా నటించడానికి రెడీ అయిపోయింది ఈ హీరోయిన్. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఎంపిక చేసాడు దర్శకుడు శంకర్.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే బాలీవుడ్ లో కియారా అద్వానీ కి భారీ క్రేజ్ ఉండటంతో అది బిజినెస్ పరంగా సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.అయితే చరణ్ సినిమా కోసం ఏకంగా రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు నో చెప్పిందట కియారా అద్వానీ.ఇక సినిమాల్లో హీరోయిన్లకు సైతం ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఇచ్చే దర్శకులలో శంకర్ ముందుంటారనే సంగతి తెలిసిందే.ఇక శంకర్, చరణ్ కాంబో మూవీ మిస్ చేసుకుంటే మళ్ళీ ఇలాంటి ఆఫర్ రావడం కష్టమని భావించి వెంటనే ఈ సినిమాకు కియారా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక శంకర్ సినిమాలో కియారా అద్వానీ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.ఇక శంకర్ సినిమా అంటే సాధారణ సినిమాలకన్నా ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శంకర్ సినిమాకు డేట్స్ కనుక అడ్జెస్ట్ చేయలేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి కియారా అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక శంకర్, చరణ్ సినిమా కనుక సక్సెస్ అయితే కియారా కు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.ఇక త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల సినిమాలో ఈ హీరోయిన్ కి సంబంధించి  స్పష్టత రానుంది.రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి గతంలో వినయ విధేయ రామ ప్లాప్ కాగా ఈ సినిమాతో కియారా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: