ప్రస్తుత కాలంలో సినిమా పరిశ్రమలో టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరో స్టేటస్ ను అందుకోలేకపోతున్నారు. అయితే నాని మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

అష్టాచమ్మా సినిమాలో నాని మరియు అవసరాల శ్రీనివాస్ కలిసి నటించిన విషయం అందరికి తెలిసిందే. అష్టాచమ్మా సినిమా నాని కెరీర్ కు మంచి ప్లస్ అయిందని చెప్పాలి. అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో బాధ పడే మూమెంట్ ఏదీ రాలేదని అవసరాల శ్రీనివాస్ తెలిపారని సమాచారం.

అల్లరి నరేష్ మరియు నాని తనకు మంచి స్నేహితులని అవసరాల శ్రీనివాస్ అన్నారని సమాచారం. నాని తనకు ఎక్కువ క్లోజ్ అని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారని తెలుస్తుంది.అష్టాచమ్మా సమయంలో తాను, నాని కబుర్లు చెప్పుకునేవాళ్లమని అవసరాల వెల్లడించారని సమాచారం. నేను ఎంచుకున్న దారి వేరని క్రియేటివ్ గా ఉండటం తనకు చాలా ఇష్టమని అవసరాల తెలిపారట. తనకు ఎటువంటి వ్యసనాలు లేవని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నట్లు సమాచారం. తనకు మంచి సర్కిల్ ఉందని అవసరాల అన్నారట.

నానితో కలిసి ఇటీవల నాలుగు గంటలు మాట్లాడానని అవసరాల శ్రీనివాస్ చెప్పడం జరిగింది.

రైటింగ్ విషయంలో తాను చాలా లేట్ అని అవసరాల చెప్పారట. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ బ్రదర్ పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్సినిమా గురించి చెబుతూ సుకుమార్ మరియు ఎన్టీఆర్ సెట్స్ లో ఫన్ క్రియేట్ చేసేవారని చెప్పారని తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ మరియు రాజీవ్ కనకాల కూడా తనతో చాలా సరదాగా ఉండేవారని అవసరాల శ్రీనివాస్ తెలిపారని సమాచారం.
అవసరాల శ్రీనివాస్ రచయిత మరియు దర్శకుడు కావడంతో రాబోయే రోజుల్లో నాని హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తుందో లేదో చూడాలి మరి. అవసరాల శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో నూటొక్క జిల్లాల అందగాడు సినిమాతో పాజిటివ్ రిజల్ట్ సంపాదించుకున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: