పవన్ కళ్యాణ్ అంటే మాస్ హీరో. కమర్షియల్ మూవీస్‌తో అభిమానులను మెప్పించే పవర్ స్టార్. ఈ హీరోయిజంతోనే లక్షలమంది అభిమానులని సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడీ ఇమేజ్‌ని పక్కనపెట్టేస్తున్నాడట పవన్. ప్రతీ సినిమాని పొలిటికల్ ఇమేజ్ పెంచే టూల్‌గా మార్చుకుంటున్నాడని చెబుతున్నారు మేకర్స్.

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. పాలిటిక్స్‌లో బిజీ అయ్యాడు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ కెమెరాముందుకొచ్చాడు. హిందీ ఫిల్మ్ 'పింక్'ని 'వకీల్‌సాబ్‌'గా రీమేక్ చేశాడు. ఈ మూవీలో పవన్‌ని పీడితుల పక్షాన నిలిచే పేదల వకీల్‌గా ప్రజెంట్‌ చేశారు. 'సత్యమేవ జయతే' లాంటి పాటలతో పవన్‌ హీరోయిజాన్ని మరింత పెంచారు.

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం మళయాళీ మల్టీస్టారర్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో రానా క్యారెక్టర్ తగ్గించి, పవన్‌ రోల్‌ని హైలెట్‌ చేస్తున్నారని టైటిల్‌ పోస్టర్ వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇక రీసెంట్‌గా వచ్చిన 'భీమ్లానాయక్' సాంగ్‌ అయితే పవన్ రోల్‌ని మరింత హైప్‌లో వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానులంతా 'గబ్బర్‌సింగ్' పీరియడ్‌కి వెళ్లిపోయారు. పవన్‌తో హరీశ్ ఒక మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ తీస్తాడేమో ఇండస్ట్రీ జనాలు కూడా ఊహించారు. అయితే హరీశ్ శంకర్ మాత్రం దిస్ టైమ్ ఇట్స్‌ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే క్యాప్షన్‌తో పవన్ టీ గ్లాస్ పట్టుకున్న 'భవదీయుడు భగత్ సింగ్' ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేశాడు.

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చెయ్యడానికి చాలా విమర్శలు వినిపించాయి. పవన్‌కి రాజకీయాలు పట్టవని, సినిమాలే చేసుకుంటాడని ప్రత్యర్ధులు కూడా విమర్శించారు. అయితే పవన్‌ మాత్రం ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌ని పొలిటికల్‌ ఇమేజ్‌కి ప్లస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటాడని, అందుకే రొటీన్ కమర్షియల్ మూవీస్‌ వైపు వెళ్లట్లేదని చెప్తున్నారు సినీ జనాలు.

పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో 'హరి హర వీర మల్లు' అనే సినిమా వస్తోంది. హిస్టారికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్‌ రాబిన్‌హుడ్‌ తరహా పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. పెత్తందార్లని దోచుకుని, పేదలకు పంచే మంచి దొంగగా నటిస్తున్నాడని టాలీవుడ్‌ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: