తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5  ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా రెండోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా 'పంతం నీదా నాదా సై' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.ఈ టాస్క్ లో భాగంగా మళ్లీ కొన్ని టాస్క్ లు ఉంటాయని, ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్.దీనిలో భాగంగా  హౌస్ మేట్స్ ఫస్ట్ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే టాస్క్ ఆడాలి. అలాగే టీమ్స్ కి సంబందించిన డగౌట్స్ ఉంటాయి.ఉల్ఫ్ టీమ్ లో  ఈగల్ టీమ్ బాటన్స్ ఉంటాయి. అంటే పిల్లొస్ అన్నమాట.అయితే బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే అపోజిట్ టీమ్ వాళ్ల బాటెన్స్ తెచ్చుకుని డగౌట్స్ లో పెట్టుకుని మాత్రమే వాటిని కాపాడుకోవాలి..

 అనీ అలాగే ఒకరి దగ్గర ఉన్నవి వేరే వాళ్ళకి దొరకకుండా జాగ్రతగా చూసుకోవాలి అనీ ఇంకా  బాటన్స్ చిరిగిపోయినా లేదా డ్యామేజ్ అయినా అవి కౌంటబుల్ కాదు అని తెలిపారు బిగ్ బాస్.అయితే ఇలా టాస్క్ ఆడి ఎ టాస్క్ కి ఆ టాస్క్ విన్ అయితే గెలిచిన టీమ్ కి ఒక ఫ్లాగ్ వస్తుంది. అలా ఎవరి టీమ్ బాటన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్లకి ఫ్లాగ్ వస్తుంది. ఇక దీని తరువాత గెలిచిన టీమ్ నుంచీ కెప్టెన్సీ కంటెండర్స్ ఎంపిక అవుతారు. అయితే ఈగల్ టీం లో ఉన్న సిరి ఒక రేంజ్ లో టాస్క్ ఆడుతుంది.అయితే గేమ్ భాగంగా సిరి సున్నీకి దొరకడం జరిగింది. సిరి తన దగ్గరున్న  బ్యాటన్ ని తన టీషర్ట్ లో పెట్టుకుంది.దాన్ని లాక్కోవాలి అనుకున్నాడు సన్నీ . అయితే సన్నీ తన టిషర్ట్ లో ఉన్నదాన్ని  లోపల చెయ్ పెట్టి లాక్కోలేక అక్కడున్న శ్వేత ని పిలిచాడు.దీంతో ఉల్ఫ్ టీమ్ నుంచీ శ్వేత ఇంకా కాజల్ ఇద్దరూ వచ్చారు.  షణ్ముక్ కూడా వచ్చాడు.

 అప్పుడు శ్వేతా సిరి టీషర్ట్ పైకి ఎత్తి బ్యాటెన్ ని గుంజుకునే ప్రయత్నం చేసింది. సన్నీ సిరి చేతులు గట్టిగా పట్టుకునే ఉన్నాడు.అప్పుడు శ్వేతా సిరి టిషర్ట్ లో చెయ్ పెట్టి తీసే ప్రయత్నం చేసింది.కానీ సిరి మాత్రం సన్నీ నా టిషర్ట్ లో చెయ్ పెట్టి తీసాడు అని నింద వేసింది.అక్కడే ఉన్న షణ్ముక్ కూడా మరీ బనీన్ లో చేతులుపెట్టి ఎలా ఆడతారు బ్రదర్ అంటూ మాట్లాడాడు. ఆ సమయం లో వాష్రూమ్ లో ఉన్న సన్నీ ఈ మాటలు వినలేదు.విషయం తెలిసిన తరువాత డైరెక్ట్ గా సిరినే అడిగాడు సన్నీ.అప్పుడు సిరి నేను నీతో ఆర్గ్యూ చేయను కెెమెరాలు ఉన్నాయి అవి చూస్కుంటాయాని చెప్పింది.విషయానికొస్తే సన్నీ సిరి చేతులు మాత్రమె పట్టుకున్నాడు.శ్వేతా సిరి టీషర్ట్ లో చేతులు పెట్టి బ్యాటన్ ని లాగే ప్రయత్నం చేసింది. ఇది మనందరికీ క్లియర్ గా కనిపించింది. కానీ నాగార్జున ఈ విషయం తేల్చాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: