సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక దురదృష్టకరమని అన్నారు. ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అని కూడా చెప్పారు.. సినిమాలలో కథానాయికగా ఎంచుకున్న తర్వాత చివరి నిమిషంలో ఆమెను తప్పించి, వేరే వారిని ఎంపిక చేసుకునే వారు. అలా ఆమెకు అవకాశం వచ్చినట్టే వచ్చి ఇలా పోయేది. అలా అవకాశాల కోసం వెతుక్కుంటూ వచ్చిన సమయంలో కాదని, పొమ్మని ఆమెను వెళ్లగొట్టిన వారే , ఆమెను పిలిచి మరీ అవకాశం ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో నటించి స్టార్ కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఎవరో కాదు నీలాంబరి అలియాస్ రమ్యకృష్ణ. ఈమె చెన్నైలో జన్మించింది.  ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చో రామస్వామి మేనకోడలు. రమ్యకృష్ణ బాల్యం నుంచే భరతనాట్యం , కూచిపూడి తో పాటు పాశ్చాత్య నృత్యాల లో శిక్షణ పొందింది. నృత్యం బాగా చేస్తూ ఉండడం, సినిమా లక్షణాలు ఉండడంతో మొదటి అవకాశం ఈమెకు  సులభంగానే దొరికింది. అలా మొదటిసారి మలయాళంలో మమ్ముట్టి , మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన  నేరం పాలరంబోల్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.


ఇక ఈ సినిమా తీసేటప్పుడు ఈమె వయసు 13 సంవత్సరాలు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడం లేట్ అవడంతో తమిళంలో మరొక సినిమా తీసింది. ఆ తరువాత భలే మిత్రులు సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇకపోతే సినిమా అవకాశాలు త్వరగా వచ్చినప్పటికీ విజయాలు లేక బోల్తా కొట్టింది రమ్య కృష్ణ సినీ జీవితం. అల్లుడుగారు సినిమాలో ముద్దబంతి పువ్వు పాట ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. కె రాఘవేంద్రరావు కేవలం ఈమె కోసమే ఒక ప్రముఖ రచయితతో ఈ పాటను వ్రాయించి మరీ ఆమెను స్టార్ హీరోయిన్ గా తీర్చిదిద్దాడు.


ఇక ఆమె కొన్ని సంవత్సరాలు గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యి, ఆ తర్వాత కంటే కూతుర్నే కనాలి.. సినిమా ద్వారా నంది అవార్డును సొంతం చేసుకుంది. అమ్మోరు సినిమా తో దేవత గా కనిపించింది. ఈ అవతారం పై ఆమెను అందరూ విమర్శించినా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తరువాత మంచి కాసుల వర్షాన్ని కురిపించింది. ఇదివరకు అమ్మోరు పాత్రలకు కె.ఆర్.విజయ పెట్టింది పేరు అయితే అమ్మోరు సినిమా తర్వాత రమ్యకృష్ణ పేరు ముద్ర పడిపోయింది. ఏకంగా థియేటర్ల ముందు రమ్యకృష్ణ ఫోటోలు కనిపిస్తే పూజలు చేసే వారు ప్రజలు. అలా నటనతో అన్ని పాత్రలను, అన్ని వర్గాల ప్రజలను ఇట్టే ఆకట్టుకుంది రమ్యకృష్ణ.




మరింత సమాచారం తెలుసుకోండి: