తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట బాలనటిగా అడుగుపెట్టి, స్టార్ హీరోలకు కూతురిగా నటించి, ఆ తర్వాత అదే స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసిన ఈ భామ ఎవరో కాదు మీనా అని చెప్పవచ్చు.. ఈమె చూడడానికి చూడముచ్చటగా , క్యూట్ గా, చూసిన వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. మీనా మొదటిసారిగా సీతారత్నం గారి మనవరాలు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమైన , మొదటి సినిమాతోనే అత్యంత ఘన విజయాన్ని అందుకుంది.


ఈమె ముఖ్యంగా తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలలో నటించి, ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మీనా,  ఆ తర్వాత తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన కూడా నటించింది.  దక్షిణ భారతదేశం అంతటా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలలో నటించి అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు గడించింది. ఇకపోతే ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం..


మీనా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే , బెంగళూరు లో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్  అయిన విద్యాసాగర్ ను  2009వ సంవత్సరం ,  జూలై 12 వ తేదీన ఆర్య వైశ్య సమాజ్ కళ్యాణ మండపంలో పెళ్లి  చేసుకున్నారు . ఈ జంట పెళ్ళి అయిన తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామి  ఆలయాన్ని  సందర్శించారు . మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్‌లో రిసెప్షన్ ను కూడా నిర్వహించడానికి ఈ జంట తిరిగి చెన్నై వచ్చారు..ఈ ఫంక్షన్ కు  దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటులందరూ పాల్గొన్నారు.  . 2011 జనవరి ఒకటవ తేదీన వీరికి పాప కూడా జన్మించింది. ఆ పాప పేరు నైనిక.. 5 సంవత్సరాల వయస్సులో విజయ్ నటించిన థెరి (2016)చిత్రంలో బాల నటిగా పరిచయమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: