గీత మాధురి.. మాస్ సాంగ్స్ అయినా సాంప్రదాయ గీతాలైన పాడి మెప్పించడంలో గీతా మాధురి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాని నటించిన నచ్చావులే సినిమా లో "నిన్నే నిన్నే కోరా".. పాట తో జనం మనసులను మెప్పించడమే కాదు నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మంచి గాయకురాలు గా గుర్తింపు పొందింది. ఆతర్వాత చిరుత, ఏక్ నిరంజన్, రేసుగుర్రం, శ్రీమంతుడు సినిమాలలో ఆమె పాడిన పాటలకు మాస్ ప్రేక్షకుల నుంచి మాస్ గాయకురాలిగా గుర్తింపు పొందింది.


గీతా మాధురి ప్రభాకర్ - లక్ష్మి దంపతులకు 1985వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీ న జన్మించింది. ఈమె తండ్రి ప్రభాకర్ ఎస్బిహెచ్ బ్యాంకు లో మేనేజర్ గా పని చేస్తున్నారు. ఇక తల్లి లక్ష్మి గృహిణి. వీరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లా పాలకొల్లు. అయితే గీతామాధురి చిన్నగా ఉన్నప్పుడు వీరి తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు  షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ప్రాథమిక విద్య హైదరాబాద్ లోని వనస్థలిపురంలో లయోలా పాఠశాలలో పూర్తి చేసింది. చిన్నప్పటినుంచి మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టిన గీతామాధురి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో కచర్ల కోట పద్మావతి , రామాచారి ల వద్ద శాస్త్రీయ, సినీ, లలిత శాస్త్రాలలో సంగీతాన్ని అభ్యసించింది.


ఈటీవీలో ప్రసారమైన " సై సింగర్స్ ఛాలెంజ్" లో ఈమె ఫైనలిస్ట్ గా నిలిచింది. ఈమె  తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె కావడంతో అతి గారాబంగా పెంచారు. అయితే మొదట ఎయిర్హోస్టస్ అవుదాం అనుకున్న గీతామాధురి ఆ తర్వాత సింగర్ గా అవతారం ఎత్తింది. ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే,  ప్రముఖ కథా నాయకుడిగా గుర్తింపు పొందిన ఆనంద కృష్ణ నందు ను నాగూర్ లో వివాహం చేసుకుంది. నందు 100% లవ్ సినిమాలో అజిత్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక వీరిద్దరూ అతిథి అనే షార్ట్ ఫిలింలో హీరో హీరోయిన్లుగా నటించారు.

మొదటిసారి కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాసిన అనే సినిమాలో సింగర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఈమె అలా అవకాశాలు పొందుతూ సుమారుగా 450 నుంచి 500 పాటలు పాడి మంచి గుర్తింపు పొందింది. ఎన్నో మాస్ సాంగ్స్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి, నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: