రవితేజ హీరోగా నటించిన భద్ర మూవీతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను ఆ మూవీతో భారీ సక్సెస్ అందుకున్నారు. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఆ తరువాత వెంకటేష్ తో బోయపాటి తీసిన సినిమా తులసి కూడా మంచి విజయం అందుకుంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

ఆ తరువాత బాలయ్య తో సింహా మూవీ తీసి దానితో కూడా సక్సెస్ అందుకున్న బోయపాటి, ఆపై ఎన్టీఆర్ తో దమ్ము మూవీ తీసి ఫ్లాప్ చవిచూశారు. అయితే దాని తరువాత మళ్ళి బాలయ్యతో లెజెండ్, అల్లు అర్జున్ తో సరైనోడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక వంటి సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన బోయపాటి శ్రీను ప్రస్తుతం మరొకసారి బాలయ్య తో చేస్తున్న సినిమా అఖండ. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇటీవల పూర్తి చేసుకోగా త్వరలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే దీని తరువాత యంగ్ హీరో రామ్ తో నెక్స్ట్ మూవీ ని బోయపాటి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా సెట్ అయిన ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్తున్నారు.

కాగా దీని తరువాత మరొక్కసారి అల్లు అర్జున్ తో బోయపాటి పని చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న న్యూస్. గతంలో అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు ని మించేలా మరింత అద్భుతంగా బోయపాటిమూవీ స్టోరీ కూడా సిద్ధం చేస్తున్నారని, ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప, ఆ తరువాత చేయనున్న ఐకాన్ మూవీస్ పూర్తి అయిన తరువాత వీరిద్దరి కాంబో మూవీ ఉంటుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: