పూర్తిగా కథ రెడీ అయ్యాక అందుకు సూట్ అయ్యే హీరోలనే ఎంపిక చేసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జున మరియు బాలక్రిష్ణ, వెంకటేశ్ లతో రాజమౌళి ఇంతవరకూ సినిమాలు చేయలేకపోయాడని తెలుస్తుంది. నవతరం యంగ్ హీరోలనే రాజమౌళి ఎంపిక చేసుకుంటారని సమాచారం.
తాజాగా 'ఆర్ఆర్ఆర్' పూర్తి కావస్తోందట. షూటింగ్ కంప్లీట్ అయ్యి కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దసరాకు విడుదల చేస్తానన్న ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోందని సమాచారం.
ఈ క్రమంలోనే తన తర్వాత మూవీపై దృష్టి పెట్టాడట రాజమౌళి. ఇప్పటికే ప్రకటించినట్టు మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణ నిర్మాణంలో సినిమా తీయనున్నాడని తెలుస్తుంది.. అయితే రాజమౌళి అనుకున్నట్టుగా ఇప్పటికీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను తీర్చిదిద్దలేదని తెలుస్తుంది.
మొదట జేమ్స్ బాండ్ తరహా కథను మహేష్ కోసం రెడీ చేయాలని రాజమౌళి భావించాడని తెలుస్తుంది.. ఆ తర్వాత ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ ప్లాన్ చేశాడని సమాచారం.. దానికోసం ఓ నవల హక్కులు కూడా కొన్నారని తెలుస్తుంది.. ఇప్పుడు ఆ కథ కూడా ఓ కొలిక్కి రాకపోవడంతో రాజమౌళి పునరాలోచనలో పడిపోయినట్టు తెలుస్తుంది..
తాజాగా మహేష్ బాబుకు దర్శకుడు రాజమౌళి మూడు లైన్లు చెప్పాడని సమాచారం.కానీ అవేవీ సంతృప్తికరంగా లేవని ఇద్దరూ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ మహేష్ కథపైనే పనిచేస్తున్నట్టు సమాచారం. ఇది మరింత ఆలస్యం అయ్యేలా ఉందని వార్త వినిపిస్తుంది. దీంతో ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో ఒక సినిమా చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని సమాచారం. మహేష్ కూడా ప్రస్తుతం 'సర్కారివారి పాట',మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలలో నటిస్తున్నాడు . ఆ రెండింటి తర్వాత రాజమౌళి సినిమా ఉండనుందని తెలుస్తుంది.