వెండితెరపై కమల్ హాసన్ వారసురాలిగా అడుగుపెట్టిన శృతిహాసన్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుందని తెలుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలోకి అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి మొదటి సినిమానే ఫ్లాప్ గా నిలిచిందని తెలుస్తుంది.

అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ తరువాత పలు సినిమాలలో నటించిన అనుకున్నంత గుర్తింపు రాలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శృతి హాసన్ ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతోందని సమాచారం.

ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమకి దూరమైన బ్యూటీ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తిరిగి ఇండస్ట్రీలో బిజీ అయ్యారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారని సమాచారం.ఇందులో శృతి హాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉందట . ఇదిలా ఉండగా శ్రుతిహాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు సరసన నటిస్తోందని సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. దాదాపు చివరి దశకు షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా వెల్లడించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉందని సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లను వెతికినప్పటికీ ఫైనల్ గా దర్శకుడు శృతి హాసన్ ని సంప్రదించి ఈ సినిమాలో నటించాలని కోరారని సమాచారం. అయితే గోపీచంద్ తో ఉన్న అనుబంధంతో శృతిహాసన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోక తప్పలేదని తెలుస్తుంది.
ఇందులో బాలకృష్ణ భార్యగా ఓ గృహిణి పాత్రలో శృతి హాసన్ కనిపించనుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎంతో స్లిమ్ గా ఉన్నటువంటి శృతిహాసన్ బాలయ్య సినిమాలో నటించడం కోసం శరీర బరువు పెరగాలని చెప్పారట. ఈ విషయం తెలిసిన శృతి అభిమానులు బాలకృష్ణ సినిమాలో నటించడం కోసం తన కెరీర్ ను నాశనం చేసుకోబోతోందా అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమాలో వీరిద్దరి జోడి ఏవిధంగా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: