సినిమా పరిశ్రమలో మేల్ కమెడియన్ లకు ఉన్న గుర్తింపు ఫిమేల్ కమెడీయన్ లకు పెద్దగా లేదనే చెప్పాలి. టాలీవుడ్ లో మాత్రమే కాదు అన్ని భాషల లో ఫిమేల్ కమెడియన్స్ ను పెద్దగా పట్టించుకోరు ప్రేక్షకులు. కానీ తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న నటి హేమ. సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిచాలా సంవత్సరాలే కాగా ఆమె ఇప్పటి వరకు 250కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో ఆమె నటించిన నటనకు నంది అవార్డు సైతం అందుకుంది హేమ. బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా ఈ నంది పురస్కారం అందుకున్న ఈమె ఆ తరువాత నటిగా మరింత అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈస్ట్ గోదావరి జిల్లా లో పుట్టి పెరిగిన ఈమె చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తితో ఉండేది ఈ నేపథ్యంలో ఆమెకు పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ సినిమా పై తనకున్న ఇష్టాన్ని చూపించింది పెళ్లి తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన ఈమె మురళి చిత్రంతో మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది పేరు కృష్ణవేణి సినిమాలలోకి వచ్చిన తర్వాత మార్చుకుంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత పేరు తెచ్చుకుందో కమెడియన్ గా కూడా ఆమె అంతే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో నాలుగు చిత్రాలు చేసింది. అలాగే హిందీలో కూడా ఓ చిత్రంలో నటించింది. బుల్లితెరపై కూడా తనదైన శైలిలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఆమె 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మండపేట నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయగా సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన ఈమె దారుణంగా పరాజయం పాలయింది. ఏదైతేనేం హేమ సినీ రంగంలో రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: