మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్న రోజుల్లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి సినిమాలకు చాలా సంవత్సరాల పాటు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మరోసారి వెండితెరపై కనిపించాలని అనుకున్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే విధంగా విడుదల చేసి కుర్ర హీరోలకు నేనేమీ తక్కువ కాదు అని అనిపించుకున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో హీరోగా నటిస్తున్న చిరంజీవి ఈ సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సినిమాతో పాటు మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'లూసిఫర్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' సినిమా రీమిక్ గా తెరకెక్కబోతున్న 'బోలా శంకర్', బాబి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీగా ఉన్నాడు.

 ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి తో గుణశేఖర్ ఒక సినిమా తీయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ చిరంజీవితో చూడాలని ఉంది, మృగరాజు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో చూడాలనుంది సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా, 'మృగరాజు' సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే 'మృగరాజు' సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. గుణశేఖర్ కూడా ప్రస్తుతానికి 'శాకుంతలం' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రానా తో 'హిరణ్యకశ్యప' సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో, గుణశేఖర్ ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: