సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం యాక్షన్ చిత్రాల దర్శకుడు అయిన శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుండగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ స్టార్ అభిమానులు చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. రజినీకాంత్ ను చాలా రోజుల తర్వాత ఏ రేంజ్ లో చూడాలనుకున్నామో అదే రేంజ్ లో ఈ సినిమాలో చూడబోతున్నామని వారు కామెంట్లు చేస్తున్నారు.

పక్కా కమర్షియల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రజనీ అభిమానులకు మంచి ట్రీట్ ను అందిస్తుందని ప్రేక్షకులకు కావాల్సిన మాస్ అంశాలు అన్ని సమపాళ్లలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా నీ దసరా కానుకగా విడుదల చేసి దీపావళి లోపు ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచన. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూడా కొంత సమయం ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం వెచ్చించనున్నారు అని తెలుస్తుంది. 


ఇకపోతే ఇటీవల కాలంలో రజనీకాంత్ వరుస సినిమాలను చకచకా చేస్తున్న విషయం తెలిసిందే. కబాలి సినిమాతో ఆయన టక టక వరుస సినిమాలు చేస్తూ ఉండగా తాజాగా ఈయన మరొక చిత్రాన్ని ఇదే దర్శకుడితో చేయనున్నాడని వార్త కోలీవుడ్లో సంచలనంగా మారింది. తెలుగులో శౌర్యం శంఖం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ తమిళంలో అజిత్ హీరోగా పలు సినిమాలను చేసి హిట్ కొట్టగా ఇప్పుడు రజనీకాంత్ తో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వెంటనే తన తదుపరి చిత్రాన్ని కూడా ఆయన రజినీకాంత్ తోనే చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: