బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు జరిగిందంతా జరిగిపోయింది అంటున్నారు. ఇప్పుడు జరగాల్సింది చూడాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే గతంలో జరిగిన విషయాలను పక్కనపెట్టారు. ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని బాలీవుడ్ కోడైకూసేలా చేస్తున్నారు. ఈ స్నేహాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినోళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా షాక్ అయ్యేలా మరో వార్త బయటకు వచ్చింది.  ఆ షాకింగ్‌ న్యూస్‌ విన్నోళ్లంతా ఇది కలా.. నిజమా అంటున్నారు.      

సల్మాన్ ఖాన్‌ సినిమాలో షారుఖ్ ఖాన్, షారుఖ్ సినిమాలో సల్మాన్‌ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగానే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారనే మాటలు మొదలయ్యాయి. ఇక టాప్ హీరోలు ఇద్దరూ కలిసిపోయారు కాబట్టి, సోషల్‌ మీడియాలో ఫ్యాన్ వార్‌ కూడా ఉండదని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ సల్మాన్‌ రీసెంట్‌గా పెట్టిన ఒక పోస్ట్‌ విలువతో వీళ్ల ఫ్రెండ్‌షిప్‌ గురించి మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.  

షారుఖ్ ఖాన్‌ రీసెంట్‌గా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ఒక యాడ్ చేశాడు. అలాగే వెబ్‌ సీరీస్‌ చేయబోతున్నానని హింట్స్‌ కూడా ఇచ్చాడు. ఈ యాడ్‌కి సల్మాన్‌ ఖాన్‌ ఒక కామెంట్ కూడా పెట్టాడు. అయితే ఈ కామెంట్ ఫ్రెండ్‌షిప్‌ కొద్డీ పెట్టింది కాదనీ.. 50 లక్షలు తీసుకొని మరీ కామెంట్‌ చేశాడని మాట్లాడుకుంటున్నాయి మార్కెట్‌ వర్గాలు.

సల్మాన్ ఖాన్ ఒక పోస్ట్‌ కోసం 50 లక్షలు తీసుకున్నాడు అనగానే అంతా ఆశ్చర్యపోతున్నారు. భాయిజాన్‌ మరీ ఇంత కమర్షియలా.. కొలీగ్‌ వీడియోని రీపోస్ట్‌ చేసేందుకు ఇన్ని డబ్బులు తీసుకున్నాడా.. అసలు వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉందా లేకపోతే బిజినెస్‌ కోసం గెస్ట్ అప్పియరెన్స్‌లు ఇస్తున్నారా అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్ లు. మరి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల వ్యూహమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వీరి ఫ్రెండ్ షిప్ తాత్కాలికమేనా.. ముందు ముందు తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తారేమో చూడాలి.  





మరింత సమాచారం తెలుసుకోండి: