వరుస సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చిన
శ్రీను వైట్ల గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ ల ను ఎదుర్కొని ఇప్పుడు మంచి హిట్
సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మంచు విష్ణు హీరోగా ఢీ అండ్ ఢీ అనే సినిమాను రూపొందిస్తు ఉండగా మహేష్ బాబు తో త్వరలోనే ఓ చిత్రాన్ని చేస్తానని ఆయన ఇప్పుడు చెప్పడం విశేషం. ఈ రోజుతో ఆయన దర్శకత్వం వహించిన దూకుడు
సినిమా విడుదలై పది వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీని గురించి స్పందించిన శ్రీనువైట్ల దూకుడు
సినిమా విశేషాలను వెల్లడించాడు.
అంతేకాకుండా త్వరలోనే మహేష్ తో ఓ
సినిమా కూడా చేస్తానని దానికోసం ఓ అద్భుతమైన కథను కూడా రెడీ చేస్తున్నా అని తెలిపాడు. మహేష్ బాబుతో దూకుడు చేసిన తర్వాత వెంటనే ఆగడు
సినిమా చేయగా అది దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇద్దరి కెరీర్ లలో బిగ్గెస్ట్ ఫ్లాప్
సినిమా గా మిగిలింది. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో
సినిమా రాదేమో దానికి తోడు
శ్రీను వైట్ల కూడా వరుస ఫ్లాపులు అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ ఇక రాదనే అనుకుంటున్నారు.
అయితే ఇప్పుడు వైట్ల చేస్తున్న విష్ణు
సినిమా తో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చే ఆ అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ గతం లోలా హిట్ సినిమాలు చేస్తే మహేష్ బాబు మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. ఇకపోతే ఆగడు
సినిమా తర్వాత
శ్రీను వైట్ల చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్-అక్బర్-ఆంటోని చిత్రాలు ప్రేక్షకులను భారీగా నిరాశపరిచాయి. అంతేకకుండా వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోయిన శ్రీనువైట్ల ఒక్కసారిగా ఇలాంటి సినిమాలు చేయడం తో ఆయన కు భారీ బ్యాడ్ నేమ్ వచ్చినట్లు అయ్యింది.