తాజాగా ఆలీ యాంకరింగ్ చేస్తోన్న ఓ షోలో పాల్గొన్న మోహన్ బాబు ఆలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990వ దశకంలో ఆలీని బాగా ప్రోత్సహించిన వారిలో మోహన్ బాబు కూడా ఉన్నారు. మోహన్ బాబు ప్రతి సినిమాలోనూ ఆలీ ఉన్నారు. ఆ తర్వాత ఆలీని ఆయన దూరం పెట్టేశారు. కారణం తెలియదు కాని.. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం అయితే ఉంది. తాజాగా ఇప్పుడు ఆలీ నిర్వహించిన షోలోనే మోహన్ బాబు ఈ గ్యాప్ నకు కారణం రివీల్ చేశారు.
తన ప్రతి సినిమాలో కమెడియన్ ను పెట్టకుండా సినిమా తీసేవాడినే కాదని.. అయితే నీకు ఛాన్సులు రావడం స్టార్ట్ అయ్యాక పొగరు ఎక్కువ అయ్యిందని.. అందుకే నిన్ను నా సినిమాల నుంచి తప్పిం చేశానని మోహన్ బాబు చెప్పారు. పర్మినెంట్ బ్యానర్ లో సినిమాలు తీస్తున్నప్పుడు లక్ష, 2 లక్షల దగ్గర బేరం ఆడకూడదని ఆయన చెప్పారు. ఆలీ అలా భేర సారాలు ఆడడంతోనే కోపం వచ్చి అతడిని తన సినిమాల నుంచి తప్పించే శానని మోహన్ బాబు మొహం మీదే చెప్పేశారు. సో దీనిని బట్టి మోహన్ బాబు ఏ విషయంలో అయినా రాజీ పడరన్నది మరో సారి తేట తెల్లమైంది.