ఇంతటి రేంజ్ ని సంపాదించుకున్న ప్రభాస్, ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమా కథలనే ఓకే చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తెరకెక్కించిన సినిమా సాహో.. ఇక ఈ చిత్రాన్ని 2019 సంవత్సరంలో ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి , వంశీ కృష్ణా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.. ఈ సినిమాను తమిళ ,హిందీ , తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయగా భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఈ సినిమాను రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు.. బాక్సాఫీస్ వద్ద రూ.433 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన అప్పటికీ కథ పరంగా భారీ డిజాస్టర్ చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వచ్చి , మంచి టెక్నాలజీతో పాటు సరికొత్త సినిమా గ్రఫీ ను కూడా పరిచయం చేశారు. కానీ ఈ సాహో సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పాలి.. అంతేకాదు బాహుబలి సినిమా తర్వాత ప్రేక్షకులు.. సాహో సినిమా కూడా అంతే బాగుంటుందని ఊహించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక, కథ పరంగా డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.