భారత దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వున్న సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి, ఆలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని అజయ్ దేవ్ గన్ ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది, అయితే ఈ సినిమా ను దసరా సందర్భంగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అప్పట్లో ప్రకటించింది. కాక పోతే దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా ఈ సినిమాను అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేయడం దాదాపుగా అసంభవంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ను దసరా కు విడుదల చేయనట్లయితే సంక్రాంతికే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, దానికి ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలలో థియేటర్లను ఇంకా తెరువలేదు.

 సంక్రాంతి వరకు అన్ని పరిస్థితులు మెరుగుపడి, సినిమా థియేటర్లను అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ చేసినట్లయితే అప్పుడు ఈ సినిమా విడుదలకు పరిస్థితులు బాగుంటాయి అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ తన సినిమా రాధే శ్యామ్ ను కూడా జనవరి 14 వ తేదీన థియేటర్ లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు, ఈ సినిమాకు జిల్ పెమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో  ఫుల్ క్రేజ్ ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రభాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు పాన్ ఇండియా సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: