రిపబ్లిక్‌' సినిమా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ లో పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్ పై చర్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని తెలుస్తుంది. పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం సినీ, రాజకీయాల్లో ఇంకా తీవ్ర దుమారాన్ని రేపుతూనే ఉన్నట్లు సమాచారం.

అయితే తాజాగా సీనియర్ కమెడియన్ మరియు రాజకీయ నేత అయిన బాబూ మోహన్‌ కూడా, పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యల పై కాస్త ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిందని తెలుస్తుంది.బాబూ మోహన్‌ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారని సమాచారం.

బాబు మోహన్ మాటల్లోనే .. 'పవన్‌ కల్యాణ్‌ గారు చాలా మాటలు మాట్లాడం జరిగిందని అయితే, ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ సైడ్ వున్నారా లేక ప్రకాశ్‌ రాజ్‌ సైడ్ వున్నారా అనేదే అర్ధం కాలేదని చెప్పారట. కాబట్టి.. ముందుగా పవన్‌ కల్యాణ్ ఎవరి సైడ్ ఉండబోతున్నారో తేల్చుకోవాలని చెప్పినట్లు సమాచారం.ప్రభుత్వం సహకారం సినీ పరిశ్రమకు చాలా అవసరమని బాబు మోహన్ తెలిపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని సినిమా పరిశ్రమ ఓ విషయం అడిగిందని తెలుస్తుంది.

అయితే, మధ్యలో పవన్‌ కల్యాణ్‌ ఏదేదో మాట్లాడారు' అంటూ బాబు మోహన్ చెప్పుకొచ్చారని తెలుస్తుంది. పైగా బాబు మోహన్ ఇంతటితో ఆగకుండా తనదైన శైలిలో పవన్ పై విమర్శలు కూడా చేసినట్లు సమాచారం. 'పవన్‌ వ్యవహరించిన తీరు సరైనది కాదు' అంటూ బాబు మోహన్ చాలా క్లారిటీగా తేల్చి చెప్పారని తెలుస్తుంది. ఇక పనిలో పనిగా మా ఎన్నికల పై కూడా స్పందిస్తూ.. 'పవన్‌ ఇండస్ట్రీ సైడా లేక ప్రకాశ్‌ రాజ్‌ సైడా అనేది పవన్ ఎటు వైపు ఉంటాడో తేల్చుకోవాలి' అంటూ బాబు మోహన్ చెప్పారని తెలుస్తుంది l.

ఈ క్రమంలో ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఎన్ని ఉన్నా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి కానీ తెర ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం పద్ధతి కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది.సరే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడినా  ఏదో చిరాకుతో ఆవేశంగా మాట్లాడటం దేనికి అంటూ మండి పడ్డారట.చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పినట్లు తెలుస్తుంది. పవన్ స్పీచ్ వల్ల పరిశ్రమ పరువే పోతుంది' అని బాబూ మోహన్ చెప్పుకొచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: