ఇండస్ట్రీ లో తరచూ ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందిస్తునే ఉంటారు. తమకు జరిగిన అన్యాయాలను మీడియా ముందు వెల్లడిస్తూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ పై కొంతమంది తారలు ఉద్యమం చేసినా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సినీ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉంటే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు అని కొంతమంది వాదిస్తుండగా... మరికొందరు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని చెబుతుంటారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ హిందీ నటి సౌత్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ దర్శకుడి వల్ల ఇబ్బందులకు లోనయ్యా అని వెల్లడించింది.

నటి స్నేహ జైన్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి నోరు తెరిచింది. కెరీర్ ప్రారంభంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సౌత్ కు చెందిన ఓ దర్శకుడి నుండి తనకు ఆఫర్ వచ్చిందని... కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో తనకు అవకాశం ఇస్తానని ఫోటో మరియు వివరాలు పంపించమని దర్శకుడు కొరాడని చెప్పింది. ఆ తర్వాత హైదరాబాద్ కు రమ్మని ఫోన్ చేశాడని తెలిపింది.

హైదరాబాద్ వచ్చి ఒకరోజంతా తనతో గడపాలని దర్శకుడు చెప్పినట్లు తెలిపింది. అంతేకాకుండా దేనికైనా ఓకే చెప్పాలని దర్శకుడు అన్నాడని దాంతో తను షాక్ అయ్యా అని వెల్లడించింది. అలాంటివి చెయ్యనని దర్శకుడితో నేరుగా చెప్పానని కానీ అతడు వారం తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇలాంటివి ఇండస్ట్రీ లో సర్వసాధారణం ఆఫర్ ఇంకా ఉంది... నువ్వు ఓకే అంటే ఛాన్స్ నీకే అని చెప్పాడని తెలిపింది. దాంతో తాను గట్టిగా అరచి ఫోన్ పెట్టేసాను అని స్నేహ వెల్లడించింది. ఇదిలా ఉండగా స్నేహ జైన్ సాత్ నిభానా సాతియా -2 సీరియల్ తో బాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: