మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తుండగా దేవాలయాల భూముల విషయమై కొన్నేళ్ల క్రితం జరిగిన కొన్ని వాస్తవ వివాదాలను బేస్ చేసుకుని ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు కొరటాల తీస్తున్నట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్ర చేస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్ ఎంతో ఆదరణ అందుకోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై దీనిని ఎంతో భారీ వ్యయంతో చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ఆచార్య సినిమా డిసెంబర్ 24న విడుదల కానుందని అంటున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి వెల్లడించిన యూనిట్ త్వరలో అధికారిక ప్రకటన చేయనుందట. మరోవైపు అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న భారీ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా గంధపు చెక్కల అక్రమ రవాణాని బేస్ చేసుకుని సాగే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుననట్లు టాక్. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోగా దీనిని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిన్న మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఎంతో భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్ విలన్ పాత్ర చేస్తున్నారు. అయితే దీనిని బట్టి ఆచార్య కనుక డిసెంబర్ 24న విడుదలైతే కేవలం వారం గ్యాప్ తో మెగాస్టార్, స్టైలిష్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర తలపడడం, అలానే మామ అల్లుళ్ళ మధ్య ఆ విధంగా పోరు జరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: