సమంత, నాగచైతన్య అంగరంగ వైభవంగా రెండు మతాల ఆధారంగా రెండు సార్లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే సమంత తన పెళ్లి రోజున ధరించిన చీర అక్కినేని ఫ్యామిలీ వాళ్లకు చాలా ప్రత్యేకత అది ఎందుకో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ముఖ్యంగా సమంత - నాగ చైతన్య నిశ్చితార్థ వేడుకలతో పాటు పెళ్లి వేడుకల్లో కూడా సమంత ధరించిన చీరల విషయంలో అక్కినేని ఫ్యామిలీ చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక నిశ్చితార్థం రోజున ఈ ముద్దుగుమ్మ కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ నాగచైతన్యతో సమంతకు పరిచయమైనప్పట్నుంచి, పెళ్లికి తొలి అడుగు, నిశ్చితార్థం ఇలా అన్ని సందర్భాలను, అలాగే వారి మధ్య జరిగిన అందమైన అనుభూతులను అన్నింటినీ కూడా చక్కటి బొమ్మల రూపంలో చీరపై డిజైన్ చేశారు..
ఇక వీరి పెళ్లికి కూడా క్రేశా బజాజ్.. ఒక ప్రత్యేకమైన చీర ను , లెహంగాను కూడా డిజైన్ చేశారు. అయితే పెళ్లి వేడుకలో సమంత ధరించిన చీర ఎవరిదంటే..నాగ చైతన్య అమ్మమ్మ దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే ప్రముఖ నిర్మాత విక్టరీ వెంకటేష్ తండ్రి రామనాయుడి భార్యది. ఆ చీరను చాలా ప్రత్యేకంగా రీ మోడలింగ్ చేసి.. పెళ్లిలో సమంత ధరించింది.ఇలా చేయడం కోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయిందని సమాచారం. మరోవైపు పెళ్లి వేడుకలో సమంత ధరించిన జ్యూవెల్లరీకి సంబంధించి కూడా అప్పట్లో చాలా ఖర్చు చేశారట.