
అయితే ఇది మ్యూజికల్ గా హిట్ అయినా ఓవరాల్ గా మిశ్రమ ఫలితాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన యువకుడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అప్పటి నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. సత్యం సినిమాతో సుమంత్ హిట్ కొట్టాడు. ఇందులో జెనీలియా హీరోయిన్ గా చేసింది. అలా తన సినిమా జీవితం అంతా సాఫీగా సాగలేదు. నటుడిగా తన పాత్రకు న్యాయం చేస్తున్నా ఏదో ఒక లోపం వల్ల సినిమాలు ప్లాప్ లు అవుతూ వచ్చాయి. సుమంత్ 2004 వ సంవత్సరంలో తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. అప్పటికే సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం అయిన సంవత్సరం వరకు బాగానే ఉన్నారు.
సరిగ్గా 2005 నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇద్దరి ఆలోచనలు మరియు మనస్తత్వాలు మారిపోయాయి. అందుకే ఇక కుదరదు అనుకుని ఇద్దరూ కూర్చుని ఇక విడిపోవాలని నిర్ణయించుకున్నారు అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్వయంగా సుమంత్ తెలపడం విశేషం. అయినా ఇప్పటికీ వీరిద్దరూ కాంటాక్ట్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది. కానీ సుమంత్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకే అమ్మాయి విడిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉండగలదు. కానీ అబ్బాయి ఆమెనే తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తాడు. ఇప్పుడ సమంత నాగచైతన్య విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందా అని అందరూ కంగారు పడుతున్నారు. నాగ చైతన్య మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఆశ పడుతున్నారు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.