గత కొద్ది రోజుల నుంచి బాగా వినిపిస్తున్నది నాగచైతన్య సమంత విడాకుల విషయమే. చాలా రోజుల నుంచి ఈ విషయంపై ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ.. స్వయంగా వారి నిన్నటి రోజున విడిపోతున్నాం అని విషయం తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సినీ ఇండస్ట్రీలోని నటులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగిపోవడంతో అందరూ ఒకసారి గుండె పగిలేలా అనిపించింది.


ఇక మేమిద్దరం భార్య భర్తలుగా ఉండదలుచుకోలేదని.. కానీ స్నేహితులుగా మత్రం ఎల్లప్పుడూ ఉంటామని నాగ చైతన్య, సమంత తన ట్విట్టర్ అకౌంట్లో ద్వారా వారే స్వయంగా తెలియజేశారు. ఇక నాగచైతన్య తండ్రి నాగార్జున కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయాన్ని తెలియజేశారు. సమంత నాగచైతన్య నాకు 2 కళ్ళు లాంటి వారు.. వారిద్దరూ కొన్ని సమస్యల వల్ల విడిపోవడం జరుగుతోంది అంటూ ఎంతో దుఃఖంతో తెలియజేసినట్లు తెలియజేశాడు.

అయితే నాగార్జున పెట్టిన ఈ పోస్ట్ ను తాజాగా సురేఖవాణి కూడా ఈ పోస్ట్ పై స్పందించి ఈ యువ జంట విడిపోతుందని విషయం తెలిసి తనకు గుండె పగిలిన ఎంత పని అయింది అన్నట్లు ఎమోషనల్ అయ్యింది. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇక వీరి విషయంపై ఇప్పటికే ఎంతోమంది పలువురు ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది.. వారు చేసిన కొన్ని కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారాయి.
ఏమాయ చేసావే సినిమాతో వీరి ప్రేమ చిగురించి.. ఇరువురు కుటుంబలా అంగీకారంతో వివాహం చేసుకొని..2007 లో ఒకటైన ఈ జంట 2021 లోనే విడిపోవడం చాలా బాధ అనిపించింది అన్నట్లుగా సురేఖ వాణి ఎమోషనల్ అయింది. ఇక మరికొంతమంది అయితే మీరు ఇలా విడాకులు తీసుకోవలసిన పనిలేదు.. మురికి నీరు తేటగా మారడానికి ఎంతో కాలం పట్టదు.. అలా ఇద్దరూ కొన్ని రోజులు దూరంగా ఉండి ఉంటే వారి తిరిగి దగ్గరవుతారు అన్నట్లుగా ఎర్ర వెంకయ్య తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: