సాధార‌ణ ప్ర‌జ‌లే కాదు పెళ్లి త‌ర‌వాత విడాకులు తీసుకుంటే సెల‌బ్రెటీలు అయినా భ‌రణం చెల్లించాల్సిందే. ఇక ఉన్న ఆస్తి పాస్తుల‌ను బ‌ట్టి భ‌ర‌ణం చెల్లించ‌డం ఉంటుంది. అంతే కాకుండా విడాకులు భ‌ర్త కోరుకుంటేనే భ‌ర‌ణం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గ‌త కొద్దిరోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన స‌మంత అక్కినేని నాగ చైత‌న్య‌ల విడాకుల అంశానికి నిన్న‌టితో ఎండ్ కార్డ్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. సామ్ త‌న సోషల్ మీడియాలో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించడంతో మొద‌లైన విడాకుల చ‌ర్చ‌కు నిన్న‌టితో ఎండ్ కార్డు ప‌డ‌గా విడాకులు తీసుకునేందుకు ర‌కర‌కాల కార‌ణాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక అక్కినేని పేరును త‌న సోష‌ల్ మీడియా నుండి తీసివేసిన త‌ర‌వాత స‌మంత నాగ‌చైతన్య క‌లుసుకోలేద‌ని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా స‌మంత ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌వ‌గానే హైద‌రాబాద్ నుండి ముంబై కి మ‌కాం మార్చేసింది. అయితే స‌మంత హైద‌ర‌బాద్ నుండి ముంబై వెళ్ల‌డానికి కార‌ణం సినిమా అవ‌కాశాల‌ని కొంద‌రు వాదించ‌గా సామ్ చై లు విడిపోయేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని అందువ‌ల్లే ముంబై కి స‌మంత షిఫ్ట్ అయ్యింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రో వైపు స‌మంత ఇటీవ‌ల తిరుమ‌ల రాగా ఓ మీడియా ప్ర‌తినిధి విడాకుల అంశంపై ప్ర‌శ్నించాడు.

దానికి స‌మాధానం నిరాక‌రించిన సామ్ గుడి బుద్ధి ఉందా అంటూ మీడియానే ఎదురు ప్ర‌శ్న వేసింది. ఇదిలా ఉంటే సామ్ భ‌ర‌ణం కింద 350 కోట్లు తీసుకుంటుంద‌ని ముందు నుండి వార్త‌లు రాగా తాజాగా భ‌ర‌ణం పై మ‌రి కొన్ని వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. స‌మంత‌కు రెండు వంద‌ల కోట్లు భ‌రణం గా ఇచ్చేందుకు అక్కినేని ఫ్యామిలీ రెడీ అవ్వ‌గా సమంత చైతూ నుండి భ‌ర‌ణం తీసుకునేందుకు నిరాక‌రించింది అనే వార్త‌లు వ‌స్తున్నాయి. చైతూ తో ఉన్న బంధం వ‌ల్లే సామ్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: