ఎంగేజ్‌మెంట్‌ చాలా ప్రైవేట్‌గా జరిగింది. కానీ పెళ్లి మాత్రం పబ్లిక్‌గా ప్రకటించాకే చేసుకుంటాం అని చెప్పింది నయనతార. కానీ ఇప్పటివరకు పెళ్లి డేట్‌ గురించి క్లారిటీ లేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం నయన్, విఘ్నేష్‌ శివన్ పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. నయన్, విఘ్నేష్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో తెలిసిపోయింది.  

పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నయనతార, విఘ్నేష్ శివన్ పొంతన లేని సమాధానాలు చెప్పేవాళ్లు. ఒకళ్లు సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకుంటాం అంటే మరొకరు చాలా సమయం ఉందని చెప్పేవాళ్లు. అయితే ఇప్పుడా సమయం వచ్చిందనీ... పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం. కేరళలో నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వస్తోంది.

విఘ్నేష్ శివన్, నయనతార ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. 'నానుమ్ రౌడీథాన్' టైమ్‌ నుంచీ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే వీళ్లిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. నయన్, విఘ్నేష్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య చాలా సింపుల్‌గా నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే ఎంగేజ్‌మెంట్‌ గురించి ఎవరికీ చెప్పకపోయినా, పెళ్లి మాత్రం అందరికీ చెప్పే చేసుకుంటామని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది నయన్.

నయనతార, విఘ్నేష్ శివన్ ఈ ఏడాది చివరికల్లా ఒక ఇంటివాళ్లవుతారనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌ చివరి వారంలో నయన్, విఘ్నేష్‌ పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయనే టాక్ వస్తోంది. అందుకే ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారని చెప్పుకుంటున్నారు కోలీవుడ్ జనాలు.


మరి డిసెంబర్ నెలాఖరున పెళ్లి చేసుకుంటామంటున్న ఈ జంట.. సీక్రెట్ గా ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది. పెళ్లి వేదిక ఎక్కడ అనేది ఇంకా తెలియలేదు. కోలీవుడ్.. టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందోనని వెయిట్ చేస్తున్నారు. నయన-విఘ్నేశ్ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న వేళ.. ప్రేక్షకులు ఆ పెళ్లిని కళ్లారా చూడాలనుకునే ఆశ నెరవేరుతుందో లేదో చూద్దాం.






మరింత సమాచారం తెలుసుకోండి: