ఇకపై నేను మాట్లాడను. ఎన్నికలు అయిపోయే వరకూ నేను మీడియా ముందుకు రాను అని చెబుతున్నారు ప్రకాశ్ రాజ్. తననెవ్వరూ నడిపించడం లేదు అని, ఇక్కడ ముఠాలు, ముఠా మేస్త్రీలు లేరని, ఇందులో మరో అభిప్రాయానికి తావేలేదని చెబుతున్నారు ఆయన. ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. మా ఎన్నికలకు సంబంధించి చెప్పారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
నేను యాంటీ హిందూను అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్పు. నా నమ్మకం నాది. నేను ఎవ్వరినీ ఉద్దేశించి ఏమీ మాట్లాడను. ఏ మతాన్నీ ఉద్దేశించి మాట్లాడిందీ లేదు. ఎప్పుడో రామ్ లీలా సినిమాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు విష్ణు ప్రస్తావించడం తగదు.
నేను ఎలా మాట్లాడుతున్నానో, నేనేం చెప్పగలను చేయగలను అన్నవి వివరించగలుగుతున్నానో అదే విధంగా విష్ణు ప్యానెల్ కూడా మాట్లాడొచ్చు. తప్పేం లేదు. అయితే ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నేను నా పరిధి వరకూ బాగా పనిచేసేందుకు ప్రయత్నిస్తాను. నా హయాంలో ఓ మంచి పని చేశానన్న తృప్తి చాలు. నా వెనుక ఎవ్వరూ లేరు. ఉండాల్సిన అవసరం అవతలి వారికి కూడా లేదు. నేను నా స్వశక్తితోనే గెలుస్తాను. పవన్ ను నాకు మధ్య విభేదాలు అభిప్రాయాల వరకూ మాత్రమే! దయచేసి ఇలాంటి వివాదాలు సృష్టించవద్దు. నేను గెలిచాక ఏం చేయగలనో అన్నది నా వరకూ తెలిస్తే చాలు. ఒకవేళ గెలిస్తే నా హయాంలో మంచి చేశానన్న తృప్తి నాకు మిగిలి ఉంటుంది.