ఈ మధ్యకాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అంటే కేవలం విజయశాంతి, అనుష్క ,సమంత, నయనతార లాంటి హీరోయిన్లు మాత్రమే గుర్తుకు వస్తున్నారు.. కానీ అప్పట్లోనే జయప్రద ,జయసుధ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ,వారి సినీ కెరీర్లోని మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సినీ చరిత్రలోనే కూడా క్లాసికల్ ఫిలిమ్స్ ను అందివ్వడం జరిగింది. ముఖ్యంగా సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా జయసుధ నటించిన తీరు ,ఆ తర్వాత వేశ్య పాత్రలో ఆమె చేసిన పాత్రకు నంది అవార్డు కూడా లభించింది.ఆ తర్వాత జయప్రద కూడా తనదైన శైలిలో నటించి, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా ఆమె అప్పట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో కథ మొత్తం జయప్రద చుట్టూనే సాగుతుంది. అయితే ఆ సినిమా ఏంటి..? ఆ సినిమా గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అంతులేని కథ. కె. బాలచందర్ దర్శకత్వంలో 1976 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జయప్రద జీవితంలో బెస్ట్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. అంతేకాదు సినీ చరిత్రలోనే మంచి క్లాసికల్ ఫిలిం గా నిలిచిపోయింది. రజనీకాంత్ కూడా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారనే చెప్పాలి.. ముఖ్యంగా ఒక మధ్య తరగతి అమ్మాయి తన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరుకుంది అనే విషయాలను చాలా చక్కగా ఆవిష్కరించింది ఈ సినిమా.

అలాగే విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి ప్రేక్షకులలో మంచి స్పందనను దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాని 1974 వ సంవత్సరం లో తమిళంలో విడుదలైన అవల్ ఒరు తోడర్ కథైకి అని సినిమా నుంచి తెలుగులో అంతులేని కథ సినిమా ను  రీమేక్ చేశారు.. అంతే కాదు, తమిళంలో కూడా ఈ సినిమాను కే బాలచందర్ దర్శకత్వం వహించడం గమనార్హం. తమిళంలో సుజాత పోషించిన పాత్రకు తెలుగులో జయప్రద నటించి , ఉత్తమ చిత్రంగా గుర్తింపు పొందింది.. ఇకపోతే ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే చిత్రీకరించడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: