టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న 'అలీతో సరదాగా' అనే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.హీరోగా 150 కి పైగా చిత్రాల్లో నటించి..విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 400 కి పైగా సినిమాలు..నటుడిగా ఉంటూ 60 కి పైగా చిత్రాలను నిర్మించిన హీరో కం నిర్మాతగా మోహన్ బాబు తప్ప తెలుగు చిత్ర పరిశ్రమలో మరెవరూ లేరు.అంతేకాకుండా విద్యా వేత్తగా, ఒక రాజకీయ వేత్తగా కూడా ఆయనకి మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి.

ఇక మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ స్కూల్లో ఎంతో మంది IAS, IPS ఆఫీసర్లు అయ్యారని చెప్పారు.అంతేకాదు తన విద్యానికేతన్ లో చుదువుకున్న ఐశ్వర్య రాజేష్..ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది అంటూ మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.ఇక రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్..సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్'సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా..

బాక్సాఫీస్ దగ్గర మాత్రం సరైన కలెక్షన్స్ ను అందుకోలేకపోయింది.ఇక ఈ హీరోయిన్ ఒకప్పటి హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేష్ కూతురు.ఈయన ప్రముఖ స్టార్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ కి తమ్ముడు.అంతేకాదు ఐశ్వర్య రాజేష్ తాత గారు కూడా అప్పట్లో ఎన్టీఆర్ తో పలు చిత్రాల్లో సెకండ్ హీరోగా నటించారు.ఇక తన చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న ఐశ్వర్య రాజేష్ తో పాటు ఆమె అన్నయ్యలకు తన స్కూల్లోనే ఉచితంగా చదువు చెప్పించారు మోహన్ బాబు.అంతేకాదు ప్రస్తుతం ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ స్కూల్లో ఇప్పటికీ కొంతమంది నటీ నటుల పిల్లలు చదువుతుంటడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: