![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/ananya-nagalla-movie-gossip147d1026-16ee-44fb-84f7-04b40a46a82f-415x250.jpg)
తెలుగు సంప్రదాయానికి చీర కట్టినట్టు ఎంతో పద్ధతిగా ఉండే అనన్య ఇలా ఒక్కసారిగా ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తుండడంతో మొదట్లో ప్రేక్షకులు షాక్ అయినా, ఆ తర్వాత ఈమె పోస్టులకు అలవాటైపోయారు. ఎంత క్యూట్ గా ఉండే అనన్య కు ఇప్పుడు తాజాగా ఓ యంగ్ హీరో చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. ఈ మధ్య సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోలతో రచ్చరచ్చ చేస్తూ పెద్ద సెలబ్రిటీగా మారిపోయిన అనన్యకు పిలిచి మరి అవకాశం ఇచ్చారట ఆ డైరెక్టర్. అయితే ఆ చిత్రంలో అనన్య పాత్ర చాలా మోడ్రన్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి ఆమె డేట్స్ కూడా ఇచ్చేసారని సమాచారం. అతి త్వరలోనే తన నూతన చిత్రం గురించి అధికారికంగా ప్రకటించనున్నారట అనన్య . ఇంతకీ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు...నిజంగానే అనన్య ఇపుడు మరో చిత్రంలో హీరోయిన్ గా చేస్తోందా అంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే మరో వైపు మన హాట్ క్యూట్ బ్యూటీ అనన్య నాగళ్ళ మాత్రం సోషల్ మీడియాలో తన తాజా ఫొటో షూట్ లతో అభిమానుల సంఖ్యను అంతకంతకూ పెంచేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి మంచి తరుణం కోసం వెయిట్ చేస్తోంది.