తన గుండెను, కాలేయాన్ని తీసి తన ప్రేయసికి దానంగా ఇచ్చిన గొప్ప ప్రేమికుడు.. క్లైమాక్స్ లో జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి..ఇప్పటి వరకు ఏ సినిమాలో ఏ డైరెక్టర్ ఊహించనంత విధంగా ఈ సినిమాలో డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ వినూత్నంగా ఆలోచించి, సినిమాను దర్శకత్వం చేయడం ఒక ఎత్తయితే, తన నటనతో ప్రేక్షకులను మరింత నవ్వించి సినిమాకే హైలెట్ గా నిలిచాడు హీరో సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన, ఆ తర్వాత కొబ్బరి మట్ట, క్యాలీఫ్లవర్ , సింగం 123, వైరస్ ,బజార్ రౌడీ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మరింత అలరిస్తున్నాడు.
సంపూర్ణేష్ బాబు ఏ సినిమాలో నటించిన సరే ఫుల్ కామెడీతో ఆ సినిమా తెరకెక్కడమే కాకుండా అత్యధికంగా విజయాన్ని అందుకుంటుంది.. ఉదాహరణకు హృదయ కాలేయం సినిమా కేవలం 52 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిగా.. ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఏకంగా నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. చిన్న తరహాలో తీసిన ఏ సినిమా కూడా ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. సినిమా పోస్టర్ చూస్తే చాలు కడుపుబ్బా నవ్వుకునే ప్రేక్షకులు సినిమా ఎలా ఉంటుందో అని వెళ్లగానే మంచి ఫీల్ తో బయటకి రావడం గమనార్హం.