నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకొని నేటికి సరిగ్గా నాలుగేళ్లే అయ్యింది. కానీ చైసామ్ లవ్‌స్టోరికి మాత్రం చాలా హిస్టరీనే ఉంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి సినిమాతోనే వీరిద్దరి ప్రేమ కథ మొదలైంది. ఏడేళ్లపాటు నడిచిన ఈ లవ్‌స్టోరి నాలుగేళ్ల క్రితం పెళ్లి పీటలెక్కింది. నాగచైతన్యకి ఫస్ట్ హిట్‌ ఇచ్చిన సినిమా 'ఏమాయ చేసావే'. ఈ హిట్‌తో పాటే సమంత కూడా చై లైఫ్‌లో అడుగుపెట్టింది. 2010లో రిలీజైన ఈ సినిమా సెట్స్‌లోనే ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ మొదలైంది. కొన్నాళ్లకి ఆ స్నేహం ప్రేమగా మారింది. ఏడేళ్ల తర్వాత ప్రేమికులుగా మారిన ఈ స్నేహితులు 2017 అక్టోబర్‌ 7న పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య, సమంత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీళ్లి పెళ్లి జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ముచ్చట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

నాగచైతన్య, సమంత మేరీడ్‌ లైఫ్‌లో అడుగుపెట్టాక వీళ్ల కోసం కథలు కూడా పుట్టుకొచ్చాయి. రియల్‌ లైఫ్‌ కపుల్‌తో సినిమాలు తీస్తే బిజినెస్‌ బావుంటుందని వీళ్లతో సినిమాలు తియ్యడానికి దర్శకనిర్మాతలు  పోటీపడ్డారు. అయితే చైసామ్‌ కెమిస్ట్రీతో, నిర్మాతలకి మంచి లాభాలు వచ్చాయి గానీ, రియల్‌లైఫ్‌లో మాత్రం ఈ కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. నాలుగేళ్లు నిండకముందే విడాకులు తీసుకున్నారు.


మొత్తానికి నాగచైతన్య సమంత ప్రేమ కథకు ఫుల్ స్టాప్ అయితే పడింది. కానీ అంత ఇష్ట పడి పెళ్లి చేసుకున్న వీరు విడిపోవడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. వారి వివాహ జీవితం సంతోషంగా కొనసాగింటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ ఎవరి ఊహలకు అంద విధంగా ఆ జంట విడిపోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి విడాకులు అయితే తీసుకున్నారు గానీ.. ఫ్రెండ్ షిప్ గా కొనసాగుతామంటున్నారు. మరి వీరు భవిష్యత్తులో మళ్లీ కలుస్తారా.. లేక ఎవరి జీవితం వారు చూసుకుంటారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: