తెలుగు సినిమా పరిశ్రమలో కమర్షియల్ హీరోలే ఎక్కువగా ఉన్నారు కానీ హాస్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించేవారు ఎంతమంది ఉన్నారో వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఆ విధంగా 90వ దశకంలో తెలుగు ప్రేక్షకులను తన కామెడీ హీరోయిజం తో ఎంతగానో అలరిస్తూ వచ్చాడు రాజేంద్రప్రసాద్.  ఆయన తర్వాత ఇంకా ఏ హీరో కూడా ప్రేక్షకులను ఆ రేంజ్ లో మెప్పించలేకపోయాడు. కమర్షియల్ సినిమాల వరకు అయితే ఇతర హీరోలు ఓకే కానీ కామెడీ సినిమాల వరకు రాజేంద్రప్రసాద్ కింగ్ అని చెప్పవచ్చు.

అలాంటి తరుణంలో రాజేంద్ర ప్రసాద్ కు పోటీగా వచ్చాడు హీరో నరేష్. రాజేంద్రప్రసాద్ ను గుర్తు చేస్తూ ఆయన ఎన్నో హాస్య భరితమైన చిత్రాల్లో నటించి హీరోగా ఎదిగాడు. ఆ విధంగా ఆయన చేసిన చిత్రం భళారే విచిత్రం సినిమా తెలుగు ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తూనే ఉంది. 1991లో విడుదలైన ఈ సినిమా ను రామచంద్ర రావు అనే దర్శకుడు చేయగా మరాఠీ కామెడీ బ్లాక్ బస్టర్ సినిమా కు ఇది రీమేక్ అని స్పష్టం చేశారు. శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలో మహర్షి బ్రహ్మానందం తులసి కోట శ్రీనివాసరావు వంటి వారు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు సినిమా క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పవచ్చు.

కన్నడ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఆ తరువాత రీమేక్ చేశారు. బ్రహ్మచారులకు ఇల్లు అద్దెకు దొరకని సమయంలో హీరో అండ్ టీమ్ ఏ విధంగా ఓ ఇంట్లో అద్దె కు దిగుతారు అనే కాన్సెప్టుతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. శుభలేక సుధాకర్ లేడీ వేషం వేసి తాము ఒక ఫ్యామిలీ అన్నట్లుగా ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి నటిస్తూ ఇంట్లోకి అద్దెకు దిగుతారు. ఆ తర్వాత ఆ ఓనర్ కి వీరి మధ్య వీరి మధ్య జరిగే వ్యవహారమే ఈ చిత్రం యొక్క కథ.  ఇది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అని చెప్పవచ్చు విద్యాసాగర్ సంగీతం సమకూర్చగా ఆయన పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: