ఇక అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి చిన్నపిల్లలు సైతం ఎంతో ఇష్టపడి చూడడం విశేషంగా చెప్పుకోవాలి. గజేంద్రుడు పేరుతో ఈ సినిమాలో కనపడే ఏనుగుని ప్రత్యేకంగా కొన్నాళ్ల పాటు తమ సినిమా కోసం వినియోగించుకుని ట్రైనింగ్ ఇచ్చిన మూవీ యూనిట్ అది తరచు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పలు ఆహారాలు, ఫలహారాలు అందచేసేవారట. ఇక ఎంతో ప్రయాశపడి మావటి సహాయంతో దానికి చాలా రోజుల పాటు ట్రైనింగ్ ఇప్పించి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ సినిమా చిత్రీకరించారట. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కోటశ్రీనివాస రావు, బ్రహ్మానందం, మల్లిఖార్జున రావు తదితరులు ముఖ్య పాత్రలు చేయగా సీనియర్ యాక్టర్ గుమ్మడి ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.
సినిమా ఆద్యంతం కూడా రాజేంద్రుడు, గజేంద్రుడి మీదనే సాగడంతో పాటు అందరినీ ఆకట్టుకునే హాస్యం, అలరించే సీన్స్ తో ఏ మాత్రం అస్లీలత లేకుండా ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాని ఎంతో అద్భుతంగా తీసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. హీరోయిన్ సౌందర్య తో పాటు కోట, బ్రహ్మానందం, విద్యాసాగర్, మల్లిఖార్జున రావుల సీన్స్ కూడా ఆడియన్స్ ని మరింత ఆకట్టుకుంటాయి. ఆ విధంగా టాలీవుడ్ కామెడీ సినిమాల్లో రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ కి ప్రత్యేక క్రేజ్ ఉందని చెప్పవచ్చు.