ప్రస్తుతం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఏం చెప్పారంటే.. సీవీఎల్ నరసింహారావు తనకు దాసరి కలలోకి వచ్చి విష్ణు గురించి చెప్పారన్నారు. అయితే వినడానికి వెటకారంగా అనిపించినా దాసరిని మరిచిపోలేమని సీవీఎల్ నరసింహారావు కామెంట్లు రూపంలో వెల్లడించారు. అంతేకాదు.. దాసరి నారాయణరావుతో తనకు పెద్దగా పరిచయం లేదని కేవలం ఒకటిరెండు సార్లు మాత్రమే కలిశానని ఆయన చెప్పారు. అయితే దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని సీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
ఇక కలలో దాసరి నారాయణరావుతో ఈ పరిస్థితి ఏమిటని అడిగానని దాసరి మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారని సీవీఎల్ నరసింహారావు తెలిపారు. కాగా.. మోహన్ బాబు తనను తండ్రిగా భావించారని విష్ణును తాను శిష్యుడిగా భావిస్తున్నానని దాసరి కలలో చెప్పారని సీవీఎల్ వెల్లడించారు. అంతేకాదు.. మోహన్ బాబు వాళ్ల అబ్బాయి విష్ణుకు సంస్కారం నేర్పారని ఆ సంస్కారం వల్లే పెద్దలు చెబితే తప్పుకుంటానని విష్ణు చెప్పాడని దాసరి తనతో చెప్పినట్టు సీవీఎల్ కామెంట్లు చేశాడు.
అయితే దాసరి మీ వ్యవహారం ఏమిటని అడిగారని సీవీఎల్ చెప్పుకొచ్చారు. ఇక తన దగ్గర అందరి ఫోన్ నంబర్లు లేవని చెప్పగా మీరు చేసేది మీరు చేయాలని దాసరి చెప్పారని సీవీఎల్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఎన్నికలు లేకుండా విష్ణు ఏకగ్రీవం అయ్యే విధంగా సీవీఎల్ నరసింహారావు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం అనే చెప్పాలి మరి.