ఈ నేపథ్యంలోనే జగపతిబాబు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచిపేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. జగపతి బాబు ఒక టీవీ నటితో ఎఫైర్ పెట్టుకున్నారు అని అప్పట్లో ఆధారాలతో సహా బయట పడినట్లు సమాచారం. ఇక ఈ విషయం గురించి ఇండస్ట్రీ మొత్తం పెద్ద ఎత్తున చర్చలు జరిగాయంట. అంతేకాక.. బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన ఈమె తన గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో తను బుల్లితెరకు కూడా దూరమైపోయినట్లు సమాచారం.
అయితే జగపతి బాబు విషయానికి వస్తే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైనయినా సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ హీరోగా కాకుండా విలన్ గా లెజెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అంతేకాక.. హీరోగా నటించడం కన్నా విలన్ గా నటించడం వల్లనే అతనికి ఎంతో మంచి పేరు వచ్చిందని జగపతిబాబు ఒక సందర్భంలో తెలిపారు. ఇండస్ట్రీలో జగపతిబాబు సినిమా అవకాశాలు దక్కించుకొని విలన్ పాత్రలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతున్నారు.