అయితే ఓ సినిమా షూటింగ్ లో భాగంగా సంప్రదాయ బద్ధమైన, పూజకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో త్రిష, ఎక్స్పోజింగ్ ఉన్నటువంటి డ్రెస్ ధరించి లొకేషన్ కు వెళ్లినట్లు సమాచారం. త్రిషను ఆ డ్రెస్ లో చూసిన దర్శకుడు ఆమెపై కోపడ్డారంట. ఇక అసలు బుద్ధుందా.. ఎప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలన్న విషయం కూడా తెలియదా అంటూ ఈమె పై దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారంట. అంతేకాదు.. ఆ కోపంలో డైరెక్టర్ త్రిషపై చేయి చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దాంతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.
ఇక త్రిషకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం సినిమాలో నటిస్తూనే ఉంది. అలాగే.. త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు.. త్రిష డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలోనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై త్రిష స్పందిస్తూ.. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని పెళ్లి కూడా చేసుకోవడం లేదని తాను పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపారు.