ఇండస్ట్రీలో మా ఎలక్షన్ గొడవలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. అయితే మొదట్లో జీవితా రాజశేఖర్ కూడా మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పినా సంగతి అందరికి తెల్సిందే. ఇక వీరిద్దరూ చిరంజీవి సలహా మేరకు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరారు. కాగా.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులకు జీవిత రాజశేఖర్ చుక్కలు చూపిస్తోందని చెప్పాలి మరి. ఇక ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..

అయితే ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భాంగా జీవిత మాట్లాడుతూ.. మన దేశం ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వవచ్చని ఆమె అన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఎవరైనా సరే న్యాయంగా, ధర్మంగా పోరాటం చేయాలని , లంచాలు ఇవ్వాల్సిన పని లేదని ఆమె పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు ఓటు వేయడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొందని జీవిత వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. శివబాలాజీ , రాజీవ్ కనకాల అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొంది. కాగా.. వాళ్లు సైతం నిజాలు మాట్లాడటం లేదని జీవిత చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ముఖ్యంగా వాళ్లు మాట్లాడిన మాటలు తప్పని, తాను ప్రూవ్ చేస్తాను అని కూడా అన్నారు. ఇక ఒకవేళ అలా ప్రూవ్ చేయలేని పరిస్థితి వస్తే నడిరోడ్డు మీద చెప్పుతో కొట్టండి అంటూ జీవిత వ్యాఖ్యలు చేసింది. కాగా.. సైనికుడిలా ఓట్ల కోసం పోరాటం చేయాలి తప్ప అన్యాయంగా కాదని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. కళకు భాషా భేదాలు ఎందుకని, ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాకూడదా..? అంటూ కూడా జీవిత ప్రశ్నించారు. ఇక మోహన్ బాబు ఫ్యామిలీని చుస్తే జాలి వేస్తుందని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: