మా ఎన్నిక‌లు ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభ మైంది. మా హిస్ట‌రీ లోనే ఎప్పుడూ లేని స్థాయిలో 70 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. మా అసోసియేషన్ లో 925 మెంబెర్స్ ఉన్నారు. ఇక వీరిలో883 ఓటర్లు ఉన్నారు. ఈరోజు 605 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 60 కు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక ఓట్ల లెక్కింపు లో ముందుగా ఈ సీ మెంబ‌ర్స్ ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. ఈ  సీ మెంబ‌ర్స్ తర్వాత మిగిలిన ప‌ద‌వుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అవ‌న్నీ పూర్త‌య్యాక చివ‌ర్లో మా అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు చేప‌డ‌తారు. అధ్య‌క్ష విజేత ఎవ‌రో తెలిసేందుకు రాత్రి 9 గంట‌లు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇ క మా పెద్ద‌లు మోహ‌న్ బాబు, జీవితా రాజ‌శేఖ‌ర్ , శివ‌కృష్ణ త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. మ‌రో వైపు న‌రేష్ కూడా అక్క‌డే ఉన్నారు. ఇక అటు ప్ర‌కాష్ రాజ్‌, ఇటు విష్ణు ఇద్ద‌రూ కూడా డ‌యాస్ మీదే ఉండి ఓట్ల లెక్కింపు ప‌రిశీ లిస్తున్నారు. ఇదిలా ఉంటే మా ఎన్నికల కౌంటింగ్ దగ్గర రసాభాస జ‌రుగుతోంది. ఎన్నికల అధికారి కి ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవ న‌డుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో తేడా ఉంద‌ని.. ఎన్నికల అధికారి తీరు సరిగా లేద‌ని ప్ర‌కాష్ రాజ్ ఫైర్ అవుతున్నారు.

ఇక మా పోలింగ్ ముగిశాక మీడియాతో మాట్లాడిన న‌రేష్ ఈ ఎన్నిక‌లు త‌మ పాల‌న‌కు రిఫ‌రెండెం అని చెప్పారు. విష్ణు 80 నుంచి 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తార‌ని చెప్పారు. తాను ప‌ట్టుద‌ల గ‌ల‌వాడిని అని.. మా పాల‌న లో మా ప్ర‌తిష్ట మ‌స‌క బారింద‌ని ఎంతో మంది ఆరోపించార‌ని.. వారికి ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలే గుణ పాఠం చెపుతాయ‌ని న‌రేష్ అన్నారు. ఇక మా ఎన్ని క ల‌లో ఓటు వేసేందుకు బెంగ‌ళూరు, చెన్నై ప్రాంతాల నుంచి కూడా 40 మంది వ‌ర‌కు వ‌చ్చార‌ని. వీరంతా విష్ణు కే ఓటు వేశార‌ని.. విష్ణు గెలుపులో వీరి ఓట్లు కీల‌కం కానున్నాయ‌ని న‌రేష్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: