ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. సాయి పల్లవి తనకి తగిన విలువ ఉంటుంది అంటేనే ఏ పాత్ర చేయడానికైనా ముందుకు వస్తుంటుంది. తనకు కథ నచ్చకుంటే ఎంతటి డబ్బు ఇచ్చినా సరే ఆమె రిజెక్ట్ చేయడానికి వెనుకాడదు ఈ భామ.
అయితే ఆమె ఈమె డాక్టర్ గా తన కెరియర్ ను కొనసాగించాలని, మంచి క్యారెక్టర్ ఉన్న పాత్రలు వస్తే సినిమాలలో చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. తన పెళ్లి విషయంపై మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. అయితే ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణు స్వామి సాయి పల్లవి జాతకం గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఆమె 1992 సంవత్సరం మే 9వ తేదీన జన్మించిందని, సాయిపల్లవి నక్షత్రం ఆశ్లేష నక్షత్రమని, రాశి కర్కాటక రాశి అని వేణుస్వామి వెల్లడించారు. అయితే సాయిపల్లవి లగ్నం కూడా కర్కాటకం అని వేణుస్వామి పేర్కొన్నారు.
ఇక ముఖ్యంగా ఈమెకు చర్మ సంబంధిత సమస్యలు బాధిస్తాయని వేణుస్వామి వెల్లడించారు. అంతేకాదు.. వ్యక్తిగతంగా సాయిపల్లవి జాతకంలో పెను సంచలనాలు నమోదవుతాయని వేణుస్వామి పేర్కొన్నారు. కాగా.. వివాహానికి సంబంధించి ఆమెకు సమస్యలు ఎదురవుతాయని ఆ సమస్యల వల్ల దేశవ్యాప్తంగా సాయిపల్లవి పేరు వినిపిస్తుందని వేణుస్వామి తెలిపారు. ఇక సాయిపల్లవిపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇక ఈమె మనసు చిన్న పిల్లల మనస్తత్వం లాంటిదని, తరచూ గొడవలు వస్తూనే ఉంటాయని తెలిపాడు.