ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. శ్రీకాంత్ నాకు సోదరి లాంటి వాడు.. ఇక ఈయన కొడుకు రోషన్ నన్ను ఇప్పటివరకు పెదనాన్న అని ఆప్యాయంగా పిలిచేవాడని అన్నారు. అయితే మొట్టమొదటి సారి పెళ్లి సందD స్టేజిపైన చిరంజీవి అంటూ నన్ను వేరు చేసి మాట్లాడాడని అన్నారు. ఇక చిరంజీవి శ్రీకాంత్ భార్య ఊహను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇదేనా నీ పంపకం.. నా కొడుకు నన్ను పెదనాన్న అని పిలవడం లేదంటూ నవ్వుతూ వీరి పై సెటైర్లు వేశాడు.
అంతేకాదు.. మా ఎన్నికలకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా చిరంజీవి ప్రకటించడం జరిగిందని తెలిపారు. అయితే ముఖ్యంగా మనం అంతా సినీ తారలము.. మనం పదవి కోసం ఇతరుల దగ్గర లోకువ కాకూడదని అన్నారు. అంతేకాదు.. మనలో మనమే గొడవ పడుకోవడం వల్ల ఇతర వ్యక్తులకు చులకనగా అనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఎవరైనా సరే పెద్ద తరహాగా ఉండాలి తప్ప.. ఇలా ఒక చిన్న పదవి కోసం ఇంత గొడవ పడకూడదు అంటూ ఆయన మా ఎన్నికలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.