ఎస్ ఇప్పుడు ఇదే మాట తెలుగు గ‌డ్డ‌పై వినిపిస్తోంది. అస‌లు మెగా ఫ్యామిలీ వాళ్లు అంతా కేవ‌లం సినిమా హీరోలు మాత్ర‌మేనా.. కేవ‌లం వినోదం కోసం మాత్ర‌మే వారిని తెలుగు సినిమా జ‌నాలు చూస్తారే త‌ప్పా అంత‌కు మించి మెగా ఫ్యామిలీపై తెలుగు జ‌నాలు ప్ర‌త్యేక‌మైన అభిమానం క‌లిగి ఉన్నారా ?  లేదా ? అన్న ప్ర‌శ్న వేసుకుంటే అనేకానేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందు కంటే చిరంజీవి స్టార్ హీరో గా ఓ వెలుగు వెలుగు తున్న‌ప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి పోటీ చేశారు. పార్టీ గెలిచి ఆయ‌న ముఖ్య‌మంత్రి అవ్వ‌డం అటు ఉంచితే ఆయ‌న ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేస్తే సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రిలోని పాల‌కొల్లు లోనే ఆయ‌న్ను చిత్తుగా ఓడించారు.

చ‌చ్చీ చెడీ చిరంజీవి చివ‌ర‌కు తిరుప‌తిలో అది కూడా కేవ‌లం 10 వేల లోపు ఓట్ల మెజార్టీతో గెలిచి ప‌రువు నిలుపుకున్నారు. త‌ర్వాత ఆయ‌న పార్టీని న‌డ‌ప లేక దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్య‌స‌భ‌కు వెళ్లి కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఇక క‌ట్ చేస్తే చిరు సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం 2014 ఎన్నిక‌ల‌లోనే జ‌న‌సేన పార్టీ పెట్టారు. ఆ ఎన్నిక‌ల లో ఆయ‌న పోటీ చేయ‌లేదు. గ‌త ఎన్నిక‌ల లో పోటీ చేస్తే చివ‌ర‌కు ప‌వ‌న్‌కు వ‌చ్చిన సీటు ఒక్క‌టే. ఆ ఎమ్మెల్యే కూడా ప‌వ‌న్ పై న‌మ్మ‌కం లేక పార్టీ మారిపోయారు.

క‌ట్ చేస్తే మొన్న ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ రెండు చోట్ల గాజువాక‌, భీమ‌వ‌రం లో పోటీ చేసినా రెండు చోట్లా కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇక అదే ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ మ‌రో సోద‌రుడు నాగ‌బాబు న‌ర‌సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయ‌న కూడా ఓడిపోయారు. దీనిని బ‌ట్టి మెగా ఫ్యామిలీకి రాజ‌కీయంగా ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేద‌న్న‌ది మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. క‌ట్ చేస్తే ఇప్పుడు మా ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించాయి.

ఇది పెద్ద స‌మ‌స్య కాక‌పోయినా.. ఇక్క‌డ కూడా మెగా ఫ్యామిలీ ప్ర‌కాష్ రాజ్‌ను గెలిపించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. అయినా ఆయ‌న ఏకంగా 100 కు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ప్ర‌జ‌ల లోనే కాదు.. ఇటు సాధార‌ణ జ‌నాల్లోనూ ఉన్న న‌మ్మ‌కం గురించే పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: