మొత్తానికి అందరిలో ఎంతో ఆసక్తిని, అలానే ఉత్కంఠ ని రేకెత్తించిన మూవీ ఆర్టిస్ట్స్ 2021 ఎలక్షన్స్ నిన్న జరగడం అలానే ఫైనల్ గా ఫలితాల అనంతరం మంచు విష్ణు విజేతగా గెలిచి మా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక ఈ ఏడాది అటు మంచు విష్ణు, ఇటు ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా గెలుపు కోసం ఎంతో గట్టిగా కృషి చేయడం జరిగింది. అయితే చివర్లో చాలా వరకు సీనియర్ ఆర్టిస్టుల ఓట్లు మంచు విష్ణు కి పోల్ అవడంతో ఆయన ఫైనల్ గా పీఠాన్ని దక్కించుకున్నారని అంటున్నారు.

తన తండ్రి మంచు మోహన్ బాబు తో పాటు సినిమా పెద్దల అందరి ఆశీర్వచనాలు వల్లనే తాను ఈ అద్భుత విజయం సొంతం చేసుకున్నానని, అలానే ముఖ్యంగా తాను మ్యానిఫెస్టో లో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని నూటికి నూరు పాళ్ళు తప్పకుండా నెరవేరుస్తాను అంటూ నేడు ప్రత్యేక ప్రెస్ మీట్ లో భాగంగా మంచు విష్ణు వెల్లడించారు. అలానే విష్ణు మాట్లాడుతూ మొదట ప్రకాష్ రాజ్ గారు, అలానే నేను ఇద్దరం కూడా అద్యక్షన్ పదవి కోసం పోటీ లో నిలవడంతో ఒకానొక సమయంలో తన తండ్రి మోహన్ బాబు తో ప్రత్యేకంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి తనని పోటీ నుండి తప్పుకోమని సున్నితంగా కోరినట్లు చెప్పారు విష్ణు. అయితే తాను పోటీకి సిద్ధం అయినపుడు, గెలుపో ఓటమో చూడాలని ఫైనల్ గా పోటీ లో కొనసాగినట్లు ఆయన కి చెప్పారట విష్ణు.

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్తూ, చరణ్ తప్పకుండా తనకు ఉన్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ గారికే ఓటు వేసి ఉండవచ్చని, అయితే ప్రతి ఒక్క కొడుకు కూడా తన తండ్రి మాట ని తూచా తప్పకుండా పాటించినట్లుగానే చరణ్ కూడా చిరు గారి ఆజ్ఞానుసారం ప్రకాష్ రాజ్ అంకుల్ కి ఓటు వేసి ఉండవచ్చని అన్నారు విష్ణు. అయితే తామిద్దరి ఫ్యామిలీ ల మధ్య ఎల్లపుడూ అనుబంధం మాత్రం ఉంటుందని, అలానే చరణ్ తనకు పెద్ద తమ్ముడు అనే విషయాన్ని తాను ఎప్పటికీ మరువనని చెప్పారు విష్ణు.

మరింత సమాచారం తెలుసుకోండి: