వేణు మాధవ్ లక్ష్మీ సినిమాలో చేసిన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అంతేకాదు.. వేణు మాధవ్ నల్ల బాలు నల్ల త్రాచు లెక్క అనే డైలాగ్ ఆయనికి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక ఎన్నో సినిమాలలో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణుమాధవ్ చివరికి కాలేయ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలను అందుకున్న వేణుమాధవ్ చివరి రోజుల్లో ఏ విధమైనటువంటి అవకాశాలను అందుకోలేకపోయారు. దానికి గల కారణం ఏంటంటే.. వేణుమాధవ్ మద్యానికి అలవాటు పడి ఎక్కువగా మద్యం సేవించి సినిమా సెట్ కు వెళ్లేవారంట. ఈ తరుణంలోనే దర్శక నిర్మాతలతో ఎంతో రూడ్ గా ప్రవర్తించడం వల్ల ఆయనకు చివరి రోజుల్లో సినిమా అవకాశాలు రాలేదని తెలుస్తోంది.
ఇక ఇలా వేణుమాధవ్ చివరి రోజుల్లో తనకు ఏ విధమైనటు వంటి అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన వేణు మాధవ్ అనారోగ్య సమస్యతో మృతి చెందడం అందరికి తెలిసిన విషయమే.